సుప్రభాత కవిత ; - బృంద
రెక్కల చప్పుడు వేదంలా
గాలుల సవ్వడి వేణువులా
పువ్వుల పరిమళం ధూపంలా
మబ్బుల రంగులు హారతిలా

అనుదినం వచ్చే ఆప్తమిత్రునికి
ఆలింగనంతో ఆహ్వానం పలికి
అంతకంతకూ ఎదగాలని
అచలాల ఆత్మీయ ఆశీస్సులతో

అఖిల జగతికీ చైతన్యమొసగి
అణువణువూ  ప్రసరించి
అవనిని అనురాగంతో స్పృశించి
అపేక్షగా తడిమే ఆప్యాయతతో

కదిలి వచ్చు మిత్రునికి
కరములు జోడించి భక్తిగా
కరుణతో వీక్షించి.....దీక్షగా
తీక్షణతను చూపవద్దని వేడుతూ

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు