'శంభో!'శతకము.;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 కందములు.
6.
తెల్లని దొరవని నీదరి 
జల్లగ జేరితి శివా !పజదొర వినుత !నే 
జెల్లని మాటలు మానితి 
దల్లియుఁ దండ్రియు సఖుడని దల్చితి శంభో !//
7.
 ఫాలాక్ష!నీ చిఱునగవు 
గాలపు మాయ దొలఁగించి కాంతులు చిమ్మున్ 
గాలాతీతా !వినుమొర !
మేలుగ దర్శన మిడుదొర !మినుసిగ శంభో !//
8.
నిరతము నీ పదములనే 
మురిపెము తోడ  గొలఁతు హర !ముచ్చట దీరన్ 
కరుణాభరణా !వినుమా !
పరము నొసంగర పశుపతి !వరముగ శంభో !//
9.
 కలువలు సంపెగ పూవుల 
బులకిత మైన హృది తోడ బూజను సల్ప 
న్నలరుచు దెచ్చితి వినతిగ
దిలకింపర !నాదు పూజ తిరముగ శంభో !//
10.
శరణంటిని విను నా మొర !
దరిశెన మీయవె కపాలి !దైవము నీవే !
గిరిజారమణా !శంకర !
కరుణాసాగర!పశుపతి!కావర శంభో !//

కామెంట్‌లు