నవ్వుతూ బ్రతకాలిరా !!!!- సి.హెచ్.ప్రతాప్
 1. నా భార్య  ఈ ఉదయం హఠాత్తుగా చచ్చిపోయింది. నెనెంత ట్రై చేస్తున్నా ఏడుపు రావడం లేదు. చుట్టాలు, పక్కాలతో చాలా ఇబ్బందిగా వుంది. ఏదో ఒక సలహా ఇచ్చి పుణ్యం కట్టుకోరా బాబూ" ఫోన్ లో ప్రాధేయపడ్డాడు నరేష్.
 
" ఏముంది, వెరీ సింపుల్, ఆవిడ బ్రతికి వచ్చినట్లు ఒక్క సారి ఊహించుకో, వెంటనే ఏడుపు తెరలు తెరలుగ తన్నుకు వచ్చేస్తుంది" మందు కొడుతూ చెప్పాడు రమేష్.
 
2." ఈ మ్యాచ్ లో కూడా ఘోరంగా ఓడిపోయాము. ఇక మన టీం ను వెంటనే బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి" ఆవేశంగా చెప్పాడు ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్.  
" కరెక్టే, అందుకే కిందటి మ్యాచ్ నే నీ ఆఖరు మాచ్ గా నిర్ణయించింది సెలెక్షన్ బోర్డు" కూల్ గా చెప్పాడు టీం మేనేజర్.
 
  3.  “ఇది చాలా శక్తివంతమైన బాంబు.చాలా జాగ్రత్తగా హేండిల్ చెయ్యాలి." అంటూ తీసుకోవలసిన జాగ్రత్తలను వెంగళప్పకు  వివరించి చెప్పాడు ఖలిద్. ఆఖరున "ఒకవేళ బిగిస్తున్నఫ్ఫుడు బాంబు పేలిపోయిందనుకో, అప్పుడేమి చేస్తావు?"అడిగాడు ఖలిద్.
"ఏముంది వెరీ సింపుల్,ఇంకొక బాంబును నీ దగ్గర నుండి తెప్పించుకొని బిగిస్తాను" కూల్ గా చెప్పాడు వెంగళప్ప.
4.నిప్పులు చెరిగే ఎండలో చొక్కా విప్పుకొని నిల్చున్నాడు వెంగళప్ప.
అతనిని చూసి ఆశ్చర్యంగా " అంత మండుటెండలో ఏం చెస్తున్నావు" అని అడిగాడు అతని స్నేహితుడు.   
" ఇంట్లో చాగా చెమట పడ్తోంది.ఫ్యాను లేదు అందుకని చెమటను ఆరబెట్టుకుంటున్నాను" చెప్పాడు వెంగళప్ప.
5.  పరంధామయ్య : మీ తల వెంట్రుకలు ఎలా రాలిపోయాయి?
కృష్ణయ్య: దిగులు.
 పరంధామయ్య : సర్వీసులో వుండగా బొలెడు డబ్బు సంపాదించి హాయిగా కాలు మీద కాలు వేసుకొని దర్జా వెలగబెడుతున్నావు. ఇక నీకు  దిగులు దేనికి?
కృష్ణయ్య: వెంట్రుకలు ఊడిపోతున్నాయని.

కామెంట్‌లు