అగస్త్య మహర్షి! అచ్యుతుని రాజ్యశ్రీ

 రామాయణం లో రాముని దైవం గా గుర్తించినా పైకి మామూలు మనిషి గా సలహా ఇచ్చారు ఆయన. ఆయన ఆశ్రమంలో ప్రవేశానికి అనుమతికోసం లక్ష్మణుని పంపి తాను సీతాసమేతుడై బైట నిలబడ్డాడు. ఆశ్రమంలో క్రూర సాధు జంతువులు  అన్యోన్యంగా తిరుగుతూ ఉంటాయి. వింధ్య పర్వతం ఎదిగి దారికి అడ్డం గా నిలబడితే " నేను తిరిగి ఉత్తర భారతంలో కి వచ్చేదాకా ఇలా తలొగ్గి నిలబడు" అని ఆదేశించారు ఆయన. మళ్ళీ దక్షిణ భారతం నుంచి తిరిగి రాలేదు.పంచవటిలో ఆశ్రమం కట్టుకోమని సలహా ఇచ్చాడు. అలా రాముడు భార్య తమ్ముడి తో కల్సి వెల్తుంటే  జటాయువు అనే బలమైన పెద్ద రెక్కల పక్షి వారిని  అనుసరించాడు.ఈపక్షి ఎవరో తెలుసు కుందాం.కశ్యప ప్రజాపతికి 8మంది భార్యలు.ముఖ్యమైనవారు అదితి దేవతలమాత. దితి పుత్రులు దైత్యులు రాక్షసులు. ఆవంశంలో వాడు జటాయువు.వినత కొడుకులు గరుడుడు  అరుణుడు.సూర్యరథ సారథి.అరుణుని కొడుకు జటాయువు దశరథుడికి మిత్రుడు. సీత ను రావణుడు ఎత్తు కు పోతుంటే  ఆవిషయం చెప్పినవాడు ఆపక్షిరాజు..   పంచవటిలో నివాసంతో రావణసంహారంకి బీజం పడింది. కశ్యపుడు తపస్సంపన్నుడు.కానీ 8మంది భార్యల్లో అదితి ఉత్తమురాలు.క్షేత్రం   సరిగ్గా ఉండకపోతే మంచి సంతానం
 కలగదు అని  రామాయణం చెప్తోంది. 🌷
కామెంట్‌లు