శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
806)మహానిధి-

సమస్త భూతములున్నట్టివాడు 
విశ్వము తనలోనున్నవాడు 
మహాపద్మమను నిధిగలవాడు 
సర్వవస్తు ప్రపంచమైనట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
807)కుముదః -

భూభారమును తీర్చుచున్నవాడు 
ప్రాణులను రక్షణజేయువాడు 
జీవుల మనుగడచూచువాడు 
భూమికి మోదము కలిగించువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
808)కుందరః -

భూమిని చీల్చినట్టివాడు 
ఛేదించుకుపోయిన వాడు 
ముట్టెతో కుళ్ళగించినవాడు 
స్వామి వరాహరూపము వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
809) కుందః -

భూదానమును ఇచ్చినవాడు 
స్థంభము రూపుననున్నవాడు 
వరాహవతారము అయినవాడు 
కుంద నామముగలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
810)పర్జన్యః -

మేఘములను పోలినట్టివాడు 
జీవుల తాపత్రయమణుచువాడు 
మనశ్శాంతిని ప్రసాదించువాడు 
సంతోషం వర్షించుచున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు