916)పేశలః -
========
మనోవాక్కాయకర్మల శుద్ధుడు
రమణీయ ప్రకృతి గలవాడు
అమితనేర్పును గలిగినవాడు
చూడచక్కని యాకృతి గలవాడు
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
917)దక్షః -
సమర్థుడుగా నిలిచియున్నవాడు
ధరణికి తగినట్టిదాక్షిణ్యుడు
దక్షిణామూర్తికి సమానుడు
దక్షతతో భాసించుచున్నవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
918)దక్షిణః -
దాక్షిణ్యత భావనలునిండువాడు
భక్తులను బ్రోచుచున్నట్టివాడు
ఉదారత్వమును చూపించువాడు
మంచిచెడులు గమనించువాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
919)క్షమిణాoవరః -
సహనశీలులలో శ్రేష్ఠమైనవాడు
క్షమాహృదయం కలిగినవాడు
ఉదారగుణములున్నవాడు
ఔదార్యమును చూపించువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
920)విద్వత్తమః -
సర్వజ్ఞత కలిగియున్నట్టివాడు
విద్వత్తులోఉత్తముడై యున్నాడు
జ్ఞానము నిండియున్నట్టివాడు
విద్వత్తమా నామముగలవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి