(కందములు )
46.
పులితోలు గట్టి నీవే
నెలరాజును సిగను బెట్టి నెఱవుగ వెలయన్
వలపుగ బార్వతి రాగా
నలగంగాదేవి దూకె నదరుచు శంభో!//
47.
శివ శివ!యని పిలిచితి
దివసము రాత్రియు మఱచితి దేవర!నీకై!
నివసింపర!నా మనమున
భవహర!నిన్నే గొలిచెద బ్రణతుల శంభో!//
48.
కైలాసంబున ముదముగ
శైలజ సహితుండ వైన సదమల హృదయా!
లీలఁగ నీ లోకంబుల
నేలెడి హర!నిను భజింతు నిఱవుగ శంభో!//
49
మురియుచు నీ విగ్రహముకు
విరిమాలలు జుట్టి మ్రొక్కి వేడుక మీరన్
దిరముగ నపచిత సల్పెద
జిఱునగవుల తోడ పూజ జేకొను శంభో!//
50.
తని వారగ నీ సేవలు
మును యోగీశ్వరులు సురలు ముదముగ సలుపన్
జనియెద రట నీ లోకము
నిను చూచుట కొఱకు వారు నిష్ఠగ శంభో!//
46.
పులితోలు గట్టి నీవే
నెలరాజును సిగను బెట్టి నెఱవుగ వెలయన్
వలపుగ బార్వతి రాగా
నలగంగాదేవి దూకె నదరుచు శంభో!//
47.
శివ శివ!యని పిలిచితి
దివసము రాత్రియు మఱచితి దేవర!నీకై!
నివసింపర!నా మనమున
భవహర!నిన్నే గొలిచెద బ్రణతుల శంభో!//
48.
కైలాసంబున ముదముగ
శైలజ సహితుండ వైన సదమల హృదయా!
లీలఁగ నీ లోకంబుల
నేలెడి హర!నిను భజింతు నిఱవుగ శంభో!//
49
మురియుచు నీ విగ్రహముకు
విరిమాలలు జుట్టి మ్రొక్కి వేడుక మీరన్
దిరముగ నపచిత సల్పెద
జిఱునగవుల తోడ పూజ జేకొను శంభో!//
50.
తని వారగ నీ సేవలు
మును యోగీశ్వరులు సురలు ముదముగ సలుపన్
జనియెద రట నీ లోకము
నిను చూచుట కొఱకు వారు నిష్ఠగ శంభో!//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి