ఆకాశపు నీలికాగితంపై
నక్షత్రపు పాళితో
ఎవరో మెరుపు సంతకం చేస్తున్నట్లుంది
ఎన్నో పరిమళక్షణాలతో గాలి
ప్రాణవాయువు ఊపిరి
పీలుస్తూనే ఉన్నట్లుంది
చందనపరిమళాలు నింపుకున్న మట్టి
ఆటవిడుపుగా అందరినీ
పలకరించిపోతున్నట్లుంది
మెరుపుతీగనుండి రాలిన పువ్వు
భూమిపై నీటి చుక్కైనట్లుంది
నిరాశ నిప్పంటించుకున్న రైతుల కళ్ళను
చినుకుల ఫైరింజన్ తో
చిరునవ్వులు చిగురించేలా చేసినట్లుంది
అందుకే ఆకాశమా!
నీ ఆచూకీ కోసం
ఎన్ని ఘనీభవించిన మంచు ధ్రువాలలోనైనా
అగ్నిపర్వతాలను పేలుస్తాం
మా గుండె గునపపుగాయాల
మూగబాధను వినిపించడానికి
నీ చిరునామాకై వెతుక్కుంటున్నాం
మా కన్నీళ్ళ జడివానలో
నిన్ను ముంచెత్తడానికి
మా కలలోకూడా నీకోసం
తడుముకుంటూనే ఉన్నాం
నీ ఆనవాలు చిక్కగానే
నిన్ను ఆనందంగా దగ్గరకు పిలిచి
ప్రేమతో కౌగిలించుకుని
సప్తవర్ణ పరిమళాల హరివిల్లుతో
మానవచరితను లిఖిస్తాము !!!
**************************************
నక్షత్రపు పాళితో
ఎవరో మెరుపు సంతకం చేస్తున్నట్లుంది
ఎన్నో పరిమళక్షణాలతో గాలి
ప్రాణవాయువు ఊపిరి
పీలుస్తూనే ఉన్నట్లుంది
చందనపరిమళాలు నింపుకున్న మట్టి
ఆటవిడుపుగా అందరినీ
పలకరించిపోతున్నట్లుంది
మెరుపుతీగనుండి రాలిన పువ్వు
భూమిపై నీటి చుక్కైనట్లుంది
నిరాశ నిప్పంటించుకున్న రైతుల కళ్ళను
చినుకుల ఫైరింజన్ తో
చిరునవ్వులు చిగురించేలా చేసినట్లుంది
అందుకే ఆకాశమా!
నీ ఆచూకీ కోసం
ఎన్ని ఘనీభవించిన మంచు ధ్రువాలలోనైనా
అగ్నిపర్వతాలను పేలుస్తాం
మా గుండె గునపపుగాయాల
మూగబాధను వినిపించడానికి
నీ చిరునామాకై వెతుక్కుంటున్నాం
మా కన్నీళ్ళ జడివానలో
నిన్ను ముంచెత్తడానికి
మా కలలోకూడా నీకోసం
తడుముకుంటూనే ఉన్నాం
నీ ఆనవాలు చిక్కగానే
నిన్ను ఆనందంగా దగ్గరకు పిలిచి
ప్రేమతో కౌగిలించుకుని
సప్తవర్ణ పరిమళాల హరివిల్లుతో
మానవచరితను లిఖిస్తాము !!!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి