శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
816)సర్వతోముఖః -

ఏకకాలంలో సర్వమూ చూచువాడు 
అన్నివిధములుగా నిలుచువాడు 
విషయములలో ప్రజ్ఞగలిగినవాడు 
నమ్మినవారికి అండయైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
817)సులభః -

భక్తసులభుడు తానైనవాడు 
తేలికగా లభించుచున్నవాడు 
భక్తులను ఆదరించగలవాడు 
ఆశ్రయించువారిని బ్రోచువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
818)సువ్రతః -

మంచివ్రతము గలిగినవాడు 
కార్యాచరణము చేయుచున్నవాడు 
కర్తవ్యము నడుపగలవాడు 
సువ్రతదీక్ష యున్నట్టివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
819)సిద్ధః -

సత్య స్వరూపియైనట్టివాడు 
సిద్ధపూర్ణ రూపములోనివాడు 
బుద్ధభగవానుడైయున్నవాడు 
స్వయంసిద్ధుడైనట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
820)శత్రుజిత్ -

శత్రువులను జయించునట్టివాడు 
సజ్జన విరోధులను తృంచువాడు 
పగతురను భంజించువాడు 
దుష్ట సంహారము చేయగలవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు