భాస్కర సేతుపతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం రాజర్షి బ్రహ్మర్షి అనే పదాలు మన రామాయణం లో వింటాం.కానీ భారతదేశంలో అలాపేరుగాంచిన రాజులు సంస్థానాధిపతులున్నారు.అలాంటి రాజర్షి భాస్కరసేతుపతి రామనాథపురం కి అధిపతి.దేవీరాజరాజేశ్వరి వారి వంశ కులదేవత.వామాచారవిధానంలో అమ్మ వారి కి జంతుబలి ఇచ్చేరోజుల వి.ఆనాటి శృంగారి శారదాపీఠాధిపతులు జగద్గురువు నరసింహభారతీ స్వాముల వారు 1894 లో రామనాథపురం సంస్థానానికి విచ్చేశారు. రాజు భాస్కరసేతుపతి ఆయన్ని దర్శించి " స్వామీ! మారాజప్రాసాదంలో ఉన్న అమ్మ వారి ఉగ్రరూపంని మార్చండి" అని వేడుకున్నాడు. అంతే! స్వామివారు శ్రీచక్రంని ప్రతిష్ఠించారు. శృంగేరినుండి వైదికసాంప్రదాయంలో అర్చనచేసే పండితులను పంపారు. ఆరోజు కొడుకు రాజరాజేశ్వరన్ తో కల్సి రాజు పీఠాధిపతులను ఇలాప్రార్ధించాడు" స్వామీ! ఈసంస్థానంని మీకు కానుక గా అర్పిస్తున్నాను." అని తన కిరీటం ఖడ్గం ఆయన పాదాలదగ్గర పెట్టాడు.ఆయన  రాజరాజేశ్వరన్ కి తిరిగి ఆసంస్థానం ని అప్పగిస్తూ " ఇక్కడ సేతుపతుల పాలన కొనసాగుతుంది " అని ఆశీర్వదించారు. సేతుపతి శృంగేరి మఠానికి కొన్ని గ్రామాలను కానుక గా ఇచ్చారు. 20జనవరి 1897 లోస్వామి వివేకానంద విదేశీ పర్యటన ముగించి స్వదేశంకి రాగానే భాస్కరసేతుపతి " స్వామీ! ముందు మీపాదాలు నాతలపై పెట్టండి " అని వేడుకున్నాడు. కానీ స్వామి తిరస్కరించారు. కానీ ఆయన ఎక్కిన బండిని కొన్ని కిలోమీటర్లు లాగుతూ సేతుపతి పాంబన్ రాజప్రాసాదానికి తీసుకుని వెళ్లి న రాజర్షి గా మారాడు.వివేకానంద స్వామి రామనాథపురం లో బసచేసి రాజర్షి అనే బిరుదు ఇచ్చారు. 4జులైలో వివేకానంద మహాసమాధి చెందిన వార్త విని దిగులు తో తన 36వ ఏట1903 లో దైవసన్నిధి చేరిన ధన్యజీవి భాస్కరసేతుపతి 🌷
కామెంట్‌లు