రామోజీరావు అనే మహా వట వృక్షం ; బల్ల కృష్ణవేణి
 పట్టు పట్టరాదు పట్టి విడవరాదు,' అన్న వేమన వాక్కులు నర నరాల్లో జీర్ణించుకున్న వ్యక్తి రామోజీరావు. కొండలు రాళ్లగుట్టలతో నిండిన నేలను భూలోక సినీ స్వర్గంగా తీర్చిదిద్దిన పట్టుదల ఆయనకు సహజా భరణం. రామోజీ ఫిలిం సిటీ నిర్మాణంలో తెలుగువారి ఖ్యాతిని గిన్నిస్ బుక్ లో లిఖింపజేశారు రామోజీరావు. శ్రమే దైవంగా భావించిన వ్యక్తి .ఆయన అందరికీ మార్గదర్శకుడు. నీతి, నిజాయితీ, విశ్వాసం, వినమ్రత, వృత్తినిబద్దత లే ఆయనకు పంచప్రాణాలు. తెలుగు భాష ప్రేమికుడు రామోజీరావు. మాతృభాష సంస్కరణకు ఆయన నడుం కట్టారు. బాశోద్యమ భాస్కరుడు ఆయన. 
రామోజీరావు అనే మహవటవృక్షంపై అనేక కోట్ల పక్షులు జీవన ఉపాధి పొందుతున్నాయి. 
అటువంటి తెలుగువారి ఆత్మబంధువు, మహామనిషి అయిన రామోజీ రావు గారు మన అందరికీ చిరస్మరణీయులు.

కామెంట్‌లు