చరవాణి అని పేరున్నా
మనల్ని నిశ్చరులను చేస్తోంది
తాను మనస మయ చోరవాణి
అందరి చేతుల్లో ఇది
మైమరిపించే మంత్రవాణి
బంధుమిత్ర బంధాలను
హరించే మన ''అరి'' ఇది
దూరదూర దూరాలను
కలుపుతుందన్న మాటే కానీ
సద్వినియోగంలేకపోతే
ఇదే మనపనులకు ''అరిపడు'' తుంది
ప్రపంచాన్ని మొత్తంగా
కాలసర్పమై కాటువేసి
తనకు అనుకూలంగా
జనాలను ఆడిస్తోంది
తస్మాత్ జాగ్రత్త సుమా!!
(అరి=శత్రువు;అరిపడు=అడ్డుపడుట)
************************************
జాగ్రత్త;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి