శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
801)అక్షోభ్యః -

క్షోభనునది తెలియనట్టి వాడు 
బాధలు ఎరుకయుండనివాడు 
కష్టనష్టములు దరిలేనివాడు 
శాంతిరూపంలో నుండినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
802)సర్వ వాగేశ్వరేశ్వరః -

వాక్పతులకునూ ప్రభువైనవాడు 
బ్రహ్మాదులకునూ పూజనీయుడు 
వాగీశ్వరులకు గురువైనవాడు 
అత్యంత గొప్ప స్థానమున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
803)మహా హ్రద-

గొప్ప జలాశయము వంటివాడు 
భక్తి దాఁహాఁర్తిని తొలగించువాడు 
జీవశక్తిని ప్రసాదించుచున్నవాడు 
మహాహ్రద నామమున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
804)మహాగర్తః -

అగాథాలతత్వమున్నవాడు 
లోయలలో దాగియున్నవాడు 
ప్రకృతిలో అంతుచిక్కనివాడు 
మహాగర్తగా నిలిచినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
805)మహాభూతః -

పంచభూతాలకునూ అతీతుడు 
ప్రకృతిలోని శక్తులున్నవాడు 
సర్వభూత శాసనము చేయువాడు 
పంచభూతాల నదుపు జేయువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు