శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది ఎం. వి. ఉమాదేవి
831)అనఘః -

పాపరహితుడై యుండినవాడు 
దోషములేవి లేకుండినవాడు 
పవిత్రతను కలిగి వున్నవాడు 
తప్పులు చేయలేనట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
832)అచింత్యః -

చింతలు లేకుండజేయువాడు 
చింతింప నవసరము లేనివాడు 
వ్యథలను తొలిగించివేయువాడు 
నిశ్చింతగా నుంచగలవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
833)భయకృత్ -

దుర్జనులకు భీతికారకుడు 
శత్రువులను భయపెట్టువాడు 
వైరి వర్గముకు భయంకరుడు 
భయకృతుడై యుండినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
834)భయనాశనః -

భయము తొలగించునట్టివాడు 
భీతిని నశింప జేయగలవాడు 
భక్తులను నిర్భయంగా నుంచువాడు 
భయనాశనము జేయుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
835)అణుః -

సూక్ష్మాతి సూక్ష్మమయినవాడు 
అణువులలో దాగియున్నట్టి వాడు 
విశ్వమంతా వ్యాపించియున్నవాడు 
అగోచరప్రకృతియున్న వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు