నిరంతర కృషితోనే సత్ఫలితాలు ; - హెచ్.ఎం. గొర్లె తిరుమలరావు.
 విద్యార్థులంతా సమయాన్ని వృథా చేయకుండా నిరంతరం చదువులపై దృష్టి సారిస్తే గొప్ప ఫలితాలను పొందగలరని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు. 
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఉపాధ్యాయులతో, విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిలబస్, పరీక్షలు, ప్రగతి పత్రాలు, తల్లిదండ్రులతో సమీక్ష, ఇంటిపని, నోట్ బుక్స్, చిత్రలేఖనం, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అదనపు తరగతుల నిర్వహణ, గుర్తించిన వెనుకబడిన అంశాల అభ్యసనం వంటివి పగడ్బందీగా అమలుచేయుట గూర్చి వ్యూహరచన గావించారు.
కనీస అభ్యసన స్థాయి అలవడేలా ప్రతీ విద్యార్థీ కృషి చేయాలని, సిలబస్ ను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ వెంటవెంటనే రివిజన్ చేసుకోవాలని విద్యార్థులనుద్దేశించి ఆయన అన్నారు. గతేడాది పదోతరగతి ఫలితాల్లో ఐదువందల మార్కులు పైబడి పన్నెండు మంది సాధించారని, కొత్తూరు మండలంలో ద్వితీయ స్థానంలో నిలిచామని, ఇంతటి ఘన విజయం వెనుక అహర్నిశలూ శ్రమించిన ఉపాధ్యాయులను హెచ్.ఎం. తిరుమలరావు కొనియాడారు. ఇటీవల పూర్వ విద్యార్ధుల సమ్మేళనాలలో గొప్ప స్థాయిలో ఉన్న పూర్వ విద్యార్ధులు పాఠశాల ప్రగతికై అందజేసిన పలు సౌలభ్యాలను ఈ సమావేశంలో తెలిపారు. తొలుత అందరికీ నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబి కుమార్ మహా పాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు