ఏక్ భారత్ శ్రేష్ట భారత్ క్యాంపుకు ఎంపికైన కేఎన్ఆర్ ఎన్సిసి నేవల్ క్యాడెట్లు
  10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్ సిసి నెల్లూరు  లెఫ్ట్నెంట్ కమాండర్  మరియు కమాండింగ్ ఆఫీసర్ గణేష్ గొడంగవే ఆదేశాల మేరకు  15 జూన్ 2024 నుంచి 24 జూన్ 2024 వరకు పది రోజుల పాటు గుంటూరులోని  కే ఎల్  యూనివర్సిటీ నందు జాతీయ స్థాయిలో నిర్వహించ నున్న ఏక్  భారత్ శ్రేష్ఠ భారత్  ఎన్  సీసీ శిక్షణా శిబిరానికి   నెల్లూరులోని  భక్తవత్సల నగర్  కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల  నేవల్ ఎన్సిసి నుంచి ప్రతిభావంతులైన  షేక్ సాధిక ఫిర్దోస్, కాకాణి  భవ్య శ్రీ  అను ఇద్దరు ఎన్ సి సి కేడేట్లను   ఎంపికచేశామని  ఆ పాఠశాల సెకండ్ ఆఫీసర్ మరియు అసోసియేట్ ఎన్ సి సి ఆఫీసర్ గుండాల నరేంద్ర బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం విజయ్ ప్రకాష్ రావు కేడేట్లను అభినందించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని  ఆకాంక్షించారు.
ఈ శిక్షణా శిభిరంలో  దేశభక్తి, జాతీయ సమైక్యత,దేశ సాంస్కృతిక వైభవం, సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వ సంపద, కళలు, క్రీడలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణా శిభిరంలో ఆరు వందల మంది ఎన్ సి సి కేడేట్లు వివిధ రాష్ట్రాలనుంచి హాజరుకానున్న  ప్రతిష్టాత్మాకమైన ఈ శిక్షణా శిభిరానికి మా పాఠశాల  కేడేట్లు ఎంపికవ్వడం మాకెంతో గర్వకారణమని పాఠశాల  ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ ప్రకాష్ రావు అన్నారు.
===================
 సెకండ్ ఆఫీసర్  గుండాల  నరేంద్ర బాబు 
10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్ సి సి 
కే ఎన్ ఆర్ నగర పాలక ఉన్నత పాఠశాల 
బి. వి. నగర్, నెల్లూరు 
సెల్ :9493235992
🌹🙏🌹

కామెంట్‌లు