కవనోపాసన;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవనకాంక్షను
రేపాలనియున్నది
కవనలోకమునందు
విహరింపజేయాలనియున్నది

కవనరాగాలను
వినిపించాలనియున్నది
కవనమాధుర్యమును
అందించాలనియున్నది

కవనకడలిని
చిలికించాలనియున్నది
కవనామృతమును
త్రాగించాలనియున్నది

కవనకాంతులను
ప్రసరించాలనియున్నది
కవనజగతిని
చూపించాలనియున్నది

కవనకుసుమాలను
చల్లాలనియున్నది
కవనసౌరభాలాను
వెదజల్లాలనియున్నది

కవనమెలుకువలను
చెప్పాలనియున్నది
కవనమర్మాలను
విప్పాలనియున్నది

కవనవర్షమును
కురిపించాలనియున్నది
కవనవరదలను
పారించాలనియున్నది

కవనప్రీతిని
కలిగించాలనియున్నది
కవనప్రేమని
పుట్టించాలనియున్నది

కవనజగతికి
పిలవాలనియున్నది
కవనకుతూహలము
లేపాలనియున్నది

కవనచోద్యాలను
చూపాలనియున్నది
కవనరంగములోనికి
దించాలనియున్నది

కవనోపాసనను
కావించాలనియున్నది
కవనయఙ్ఞమును
కొనసాగించాలనియున్నది


కామెంట్‌లు