మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి,నెల్లూరు.
అంత ఢిల్లీ సుబేదార్ గవర్నర్గా హైదరాబాదులో ఉన్న నైజాముల్క్ అనువారు ఆర్కాట్కు వచ్చి రాజ్యం అరాచంగా ఉందని మైనర్ నవాబును ఆర్కాట్ లో తన నౌకర్ల సంరక్షణలో ఉంచి హైదరాబాద్కు వెళ్లి ఏలూరు రాజమహేంద్రవరము పరగణాలు పాలించుచూడన తన నౌకరైన అణువరుద్దీ కాగాని నవాబు పని చూచుటకు నియమించారు మైనర్ నవాబును వీరి స్వాధీనంలో ఉంచారు  కొద్దికాలంలోనే మైనర్ నవాబు కొందరు నౌకర్ల వల్ల చంపబడుగా  ఆళ్వారుద్దీ ఖాన్ నైజాముల్ ముల్క్ వల్ల నవాబుగా నియమించబడ్డాడు.
ఇతనికి కూడా పూర్వపు నవాబుకు సంబంధించిన ముఖ్యుద్యోగులలో ఒకరుగా ఉండిన చందాసాహెబ్ లకు కలతలు కలిగాయి 1749లో జరిగిన ఆoబూరు యుద్ధంలో అన్వరుద్దీన్ వీరి పెద్ద కుమారుడు మఫూజకాక్ చంపబడగా రెండవ కుమారుడైన మహమ్మద్ అలీ తిరుచునాపల్లికి పారిపోయి ఇంగ్లీష్ వారి సహాయం కోరాడు ఫ్రెంచ్ వారు చందాసాహెబ్ కు సహాయం కావించారు ఇలా ఉండగా హైదరాబాదులో 104 సంవత్సరముల వయసు గల నైజాంముల్క్ చనిపోయాడు వారి ఇష్టానుసారం మనవడు శుభాకు రావలసినందున కలతలు ప్రారంభమయ్యాయి మనవడు మురుజంగ్ సాహెబ్ కు సహాయ మోనర్చ అతనిని నవాబుగా   నియమించాడు నాజర్జంగ్ మహమ్మద్ అలీ నవాబు అన్నాడు.
ఇంగ్లీష్ వారి సహాయము వల్ల అనేక యుద్ధములు అయిన తర్వాత మహమ్మద్ అలీ నవాబ్ అయ్యాడు ఇంగ్లీష్ సేనాని క్లైవ్  సహాయము వల్ల నాలుగు లక్షల వరహాలు రాబడి వచ్చు రాజ్యము అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం రాబడి సహా మహమ్మద్ అలీ కి లోబడింది కర్ణాటక యుద్ధములు నిలిచి నిలిచి జరుగుతూ ఉన్నాయి 1758లో మొహమ్మద్ ఖూమాల్  కలతల వల్ల కావేరి పాకం యుద్ధంలో తర్వాత స్వాతంత్రం వహించి నెల్లూరు ముట్టడించి స్వాధీనం చేసుకున్నాడు  నెల్లూరులో గవర్నర్ను నవాబు సవతి సహోదరుడైన నజీబుల్లా నెల్లూరు నుంచి ఆర్కాట్ కు పారిపోయాడు ఆ తరువాత సుమారు ఒక సంవత్సరం మహమ్మద్ కోమల్ జయం పొంది ఆర్కాడు కు 50 మైళ్ల దూరాన ఉన్న తిరుపతి కొండమీద ప్రసిద్ధికెక్కిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమును ముట్టడింప ప్రయత్నించటానికి వచ్చాడు.

కామెంట్‌లు