కాపురముచేయు కలకాలము పూర్తి తృప్తితో
గాలమువేయకు దురిత మానినీ సంపర్కమునకు
చాలుచాలు యిక జీవితగమనము మార్చి
జాగరూకుడవయి మెదిలి
నీ తాతతండ్రుల పరువు ప్రతిష్టల నిలిపి
దానధర్మములతో సత్పథగామియై
నారంగుడను పేరు రూపుమాపుకో
పాయము నిలువదు కలకాలము
బానిసవుగాకు దురలవాట్లకు
మానము పోయిన మనిషి ఎందుకిక?
యాతము విడిచి పులుగడిగిన ముత్యమువై
రామపాదము నాశ్రయించు సద్గుణాల ప్రోవువై!!
{నారంగుడు=విటుడు;పాయము=యౌవనము,వయసు; మానము=గౌరవము;యాతము=గతము}
**************************************
సద్గుణాలప్రోవు;- డా.గౌరవరాజు సతీష్ కుమార్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి