* కోరాడ హైకూలు *
  @ చీకటి...! 
           *****
అక్రమార్కుల
  కార్య కలాపా లన్ని
  చీకటి లోనే
 *******
వెలుగు చేసే
  నిరంతరపోరాటం
     చీకటి తోనే
  *******
సేద దీర్చేది
  సకల ప్రాణులకూ
   చీకటి తల్లి 
  *******
 చీకటితోనే
   వెలుతురు సమరం
    రేయిం బవళ్ళు
   *******
అజ్నాన రూపం
 చీకటే దాని దేహం
   జ్ఞానం....వెలుగే ! 
   *****

కామెంట్‌లు