ఆముదాలవలస విశ్వ సాహితి విడుదల చేసిన కవనవనంలో రాజాం రచయితల వేదిక సభ్యుల కవితలు స్థానం పొందాయి.
విశ్వ సాహితీ ఆధ్వర్యంతో పాటు పొన్నాడ అప్పలనరసమ్మ చిన్నవాడు సేవా సంస్థ సౌజన్యంతో ప్రచురించిన ఈ కవనవనం సంకలనంలో రారవే కన్వీనర్ గార రంగనాథం, సభ్యులు ఒమ్మి రమణమూర్తి, నేతేటి గణేశ్వరరావు, కుదమ తిరుమలరావు, బంకుపల్లి విజయశైలజల కవితలు ఎంపికై ప్రచురణకు నోచుకున్నాయి.
విశ్వసాహితీ అధ్యక్షులు పొన్నాడ వరాహనరసింహులు, ప్రముఖ కథా నవల నాటక రచయిత అట్టాడ అప్పలనాయుడు, ప్రముఖ సాహితీవేత్త డా.సనపల నారాయణమూర్తి, సాహితీ ప్రస్థానం సంపాదకులు చీకటి దివాకర్ లచే ఆవిష్కరించబడిన ఈ సంకలనంలో జాతీయ స్థాయిలో ఎంపికైన కవుల చెంత రాజాం రచయితల కవితలు కూడా చోటు చేసుకున్నాయి. గార రంగనాథం "శిక్షచాలదు ప్రక్షాళించండి!", ఒమ్మి రమణమూర్తి "మనవి", నేతేటి గణేశ్వరరావు "అమ్మ గొణుగుడు", కుదమ తిరుమలరావు "మువ్వన్నెల చంద్ర మామ", బంకుపల్లి విజయశైలజ "చంద్రసందేశం" అను కవితలు ఈ కవనవనంలో గుబాళించాయి.
రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లో విడుదలౌతున్న పలు సంకలనాలలో ఇప్పటికే వందలాది రచనలు రాజాం రచయితల కలాల నుండి జాలువారిన భావసంపత్తి కావడం మిక్కిలి గర్వకారణమని స్థానిక ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి