హిందీలో శతశాతం ఉత్తీర్ణత- అభినందన
 గతేడాది పదోతరగతి ఫలితాల్లో ఐదువందల మార్కులు పైబడి పన్నెండు మంది సాధించారని, కొత్తూరు మండలంలో ద్వితీయ స్థానంలో నిలిచామని, ఇంతటి ఘన విజయం వెనుక అహర్నిశలూ శ్రమించిన ఉపాధ్యాయులను హెచ్.ఎం. తిరుమలరావు కొనియాడారు. 
హిందీ సబ్జెక్టులో పదోతరగతి విద్యార్థులు శతశాతమూ ఉత్తీర్ణత సాధించిన నేపథ్యంలో హిందీ ఉపాధ్యాయులైన బత్తుల వినీల, బోనెల కిరణ్ కుమార్ లను అభినందిస్తూ పుష్పగుచ్చం, శాలువాలతో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, పాఠశాల సిబ్బంది కార్యదర్శి, నేషనల్ గ్రీన్ కోర్ కార్యదర్శి తూతిక సురేష్, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఘనంగా సన్మానించారు. తొలుత అందరికీ నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబి కుమార్ మహా పాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు