శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
856)వాయు వాహనః -
===============
వాయువుయొక్క చలన కారకుడు 
గాలిని మోయుచున్నట్టి వాడు 
పవనములు కలిగించెడి వాడు 
వాయువాహన నామమున్నట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
857)ధనుర్ధరః -

ధనుస్సును ధరించియున్న వాడు 
కోదండము కలిగినట్టి వాడు 
విల్లు చేతిలోనుండిన వాడు 
ధనుర్ధారిగా పేరున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
858)ధనుర్వేదః -

ధనుర్వేదము తెలిసినట్టివాడు 
ఉత్తమ విలుకానిగా నున్నవాడు 
విల్లుఅను వేదమునెరుగువాడు 
ధనుర్వేద నామమున్నట్టి వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
859)దండః -

దండించు అధికారమున్నవాడు 
ధూర్తులకు శిక్షలను వేయువాడు 
తప్పును తెలియజేయగల వాడు 
దండనాధిపత్యము గలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
860)దమయితా -

దుష్టులను శిక్షించునట్టివాడు 
క్రూరులను దండనచేయువాడు 
భక్తరక్షణకు ఆయుధమున్నవాడు 
తప్పులకు శిక్షలను వేయువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు