1స్ఫూర్తిదాతలు... అచ్యుతుని రాజ్యశ్రీ
 నేడు అమ్మాయిలు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నరోజులు.ఆరోజు బడిలో ఒక అంశం ఇచ్చి పిల్లల్ని మాట్లాడమన్నారు.ఆడపిల్లలంతా " టీచర్! మేము నేటి మహిళలు వారు చేసిన పనులు గూర్చి చెప్తాం" అన్నారు."మీ ఇష్టం.ఒక్కొక్కరు ఒక్కో స్త్రీ గూర్చి చెప్పండి" అనగానే విజయం లేచి మొదలుపెట్టింది " అందరం అమ్మ కడుపులో నుండి వచ్చాం.కానీ పెద్ద ఐనాక మర్చిపోతాం.కానీ ఛాయా కదమ్ అనే ఒక నటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చనిపోయిన తన తల్లి చీర ముక్కెర తో హాజరై అందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా చేసింది.
" మా అమ్మను విమానం ఎక్కించలేకపోయాను.కానీ నీచీర ముక్కు పుడక ముక్కెర తో విదేశీ ప్రయాణం కై
విమానం ఎక్కాను" అని అందరికీ తన భావోద్వేగాలు పంచింది.అందుకే నాకు నచ్చిన మహిళ ఛాయా కదమ్" అనగానే అందరికీ అమ్మ గుర్తుకు వచ్చింది సుమా! ఇంటికి వెళ్ళగానే అమ్మ ను చూడొచ్చు అని సంబరపడుతుంటారు విజయ ఏడాది క్రితం చనిపోయిన తన తల్లిని తల్చుకుని కన్నీటితో మాట్లాడింది.టీచర్ ఆపిల్ల భుజం తట్టి " నీవు కూడా
గొప్ప పనిచేసి మీ అమ్మ ను లోకానికి పరిచయం చెయ్యి" అనగానే పిల్లలంతా చప్పట్లు కొట్టారు2 తార లేచింది " నేను దివ్యాంగుల గూర్చి చెప్తాను.మాఅమ్మ ఆబడిలో పనిచేస్తోంది.జిల్ మోల్  మారియట్ థామస్ కేరళకుట్టి.పుట్టుకతోనే రెండు చేతులు లేవు.ఆపాప 7 లో ఏట యాక్సిడెంట్ లో‌అమ్మానాన్నలు చనిపోయారు.ఓడాక్టర్ ఆమె కి ఆసరా ఐనారు.కారు నడపాలనే ఆమె కోరిక ను వి.ఐ.ఇన్నొవేషన్ సంస్థ తీర్చింది.కాలితో కారు నడిపేలా ఏర్పాట్లు చేశారు.కానీ డ్రైవింగ్ లైసెన్స్ కోసం నానాపాట్లు పడి ఆరేళ్ల పాటు ఆర్టీవో ఆఫీస్ చుట్టూ తిరిగి ముఖ్యమంత్రి చేతుల మీదుగా లైసెన్స్ అందుకుంది.కాళ్లతో కారు నడిపే తొలి ఆసియా మహిళగా చరిత్ర కెక్కింది.యానిమేషన్ గ్రాఫిక్ డిజైనింగ్ లో కెరీర్ లో ఈ33ఏళ్ళ యువతి రాణిస్తున్నారు.
3రన్ వే పై విమానం ని దింపిన కేవలం కాళ్లతో విమానం నడిపిన గిన్నిస్ రికార్డు కెక్కిన తొలి మహిళా పైలెట్ అమెరికా కి చెందిన జెస్సికా కాక్స్.పుట్టుకతోనే చేతులు లేని ఆమె తైక్వాండో లో శిక్షణ పొందింది.విమానంని కాళ్లతో నడుపుతూ
పైలెట్ సర్టిఫికెట్ పొందింది.ఈమె పై "రైట్ ఫుటెడ్
డాక్యుమెంటరీ తీశారు.అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో అవార్డులు పొందింది చిత్రం"
ఇలా అద్భుతంగా తార చెప్పిన విషయం విని అంతా అబ్బుర పడ్డారు.ఇలాంటివారే కదా మనకు స్ఫూర్తి దాతలు..

కామెంట్‌లు