స్ఫూర్తి దాతలు 11 .. అచ్యుతుని రాజ్యశ్రీ

 మనదేశం తొలి మహిళా హెలికాప్టర్ పైలెట్ అవనీచతుర్వేది ఒంటరిగా యుద్ధం విమానం ని నడిపిన సాహసి.గోల్డెన్ వింగ్స్ అందుకున్న బంగారు తల్లి 22వారాల కఠినశిక్షణ పొంది 4పైగా హెలికాప్టర్స్ నడపటం గ్రేట్!దాదాపు 25వేలమందిని వ్యభిచార కూపంలోంచి బైటకి లాగి 100మంది మనిషితో వ్యాపారం చేసే వేరే ప్రాంతానికి తరలించే దుర్మార్గులను జైలు కిపంపిన ఘనత రుచిరా గుప్తాది.10 వ ఏటనే కాలం చేతబట్టిబిబిసి తో సహా జర్నలిస్టు గా ఎదిగారు.రుచిరా గూండాలనించి బెదిరింపులు ఎదుర్కొన్నారు.ఆడపిల్లలతో వ్యాపారం చేసే నేపాల్ థాయ్ లాండ్ ఇరాన్ యు.ఎస్.లో కూడా ఈమె సేవలు విస్తరించాయి.60 ఏళ్ల ఆమె రాసిన " ఐ కిక్ అండ్ ఐ ఫ్లై " తో రచయిత్రి గా మంచి పేరు తెచ్చుకున్నారు
2 తమిళనాడు లో వెల్లూరులో నాగానది కన్పడకుండా పోయింది.అంతే 20వేలమంది మహిళలు బావులు కుంటలు తవ్వడం మొదలుపెట్టారు.నాగానది కి ప్రాణం పోశారు.బుందేల్ఖండ్ లో నీలిరంగు చీరల్లో ఆమహిళలు నీటికై పట్టుబట్టి సాధించారు.యు.పి.లోని బుందేల్ ఖండ్ వాసులకు నీటికొరత లేకుండా చేయాలని 19 ఏళ్ల బబితారాజపుత్ కృషితో నీటిబాధతీరింది.ఆదిలాబాద్ జిల్లా ముకరా గ్రామంలో ఇంకుడు గుంతలు తవ్వించారు సర్పంచ్ మీనాక్షి.
కామెంట్‌లు