స్ఫూర్తి దాతలు 16! అచ్యుతుని రాజ్యశ్రీ

 కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించిన ఘనత వారిది.స్వాతంత్రసమరంరోజుల్లో పొందూరు ఖద్దరు గాంధీజీ నికూడా ఆకర్షించింది.వాలుగచేప దవడతో దూదిని ఏకి ఆడవాళ్ళు నూలుపోగులు తయారు చేస్తారు.దీనితో చీరెలు ధోవతులు నేస్తారు.75 ఏళ్ల జల్లేపల్లి కాంతమ్మ తన 6వ ఏటనుంచి ఈ వృత్తిలో నేర్పరి ఐంది.2013 లో ప్రధానిమోదీజీకి తన చేత్తో వడికిన నూలు బహూకరించి ప్రశంసలు పొందింది.రాధికాగుప్త మెడ కళ్ళు వంకరగా ఉండటంతో అంతా ఆమెను వింత గా చూసేవారు.ఫ్రెండ్స్ లేరు.అందంగా తల్లి ఉంది కదా నీవెందుకిలా ఉన్నావు అని తలాతోకా లేని ప్రశ్నలే ఆమెలో పట్టుదల పెంచాయి. ఇప్పుడు ఆమె సిఇఓగా రాణిస్తోంది.చిన్న స్టార్టప్లను ప్రోత్సహిస్తోంది. ప్రమాదంలో అక్షరాలు కూడా మర్చిపోయిన షెరిన్ సహానా నడుంకిందిభాగం చేతులు పనిచేయక దిగాలుపడింది. కేరళకుట్టి పి.హెచ్ డి చేస్తూ సివిల్స్ సాధించింది. ఆత్మ విశ్వాసం తన బలం అంది.🌹
కామెంట్‌లు