ఆధ్యాత్మికం:-పద్యాలతో కథ;- మమత ఐల హైదరాబాద్ 9247593432
గురుపౌర్ణమి శుభాకాంక్షలతో
====================
తేటగీతులు
*************
గురువు సందేశమియ్యగన్ కొదవలేక
జనులు వినుచుండిరంతగా సద్విమర్శ
తదుపరిన్ లేచి గురు ప్రసాదంబు కొరకు 
వరుసతో వచ్చి గైకొన తరలుచుండ్రి 

గరిమతో నొక్క బాలుడు గడికిగడికి
వచ్చి గొనిపోవుచుండెను నచ్చినట్లు
నవ్వు చిందించుచును బెట్ట నాపకుండ
నదియు పరికించి శిష్యుడు నడుగు చుండె

గురువ! కాదులేదనకియ్య పరిపరి మరి
నంత రార్ధంబు జెప్పుమా ననుచు వేడ
నీవు జూసేది నొకవైపు  నెరుగు మనుచు
చూపుచుండె నాబాలుని చురుకుదనము

దివ్య మైనప్రసాదాన్ని సవ్యముగను
వరుసలో నున్న వారికి పంచుచుండెఁ
నంత వరుసెల్ల తగ్గేడి నద్భుతంబు
స్వార్థ చింతనలేకుండె సాధువుగను
నందురీతీరు గాంచను సుందరమనెఁ
 
;

కామెంట్‌లు