ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 విశాఖపట్నం తాజ్ హోటల్ లో నాగేశ్వరావు గారిని డాక్టర్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ సమక్షంలో అడిగిన ప్రశ్న  అక్కినేని గారు సినీ రంగం నుంచి దాదాపు విరమించుకున్న తర్వాత మీ సినిమాలన్నింటినీ ముందు ఉంచుకొని గ్రేడింగ్ ఇస్తే ప్రథమ ద్వితీయ స్థానం ఎలా ఉంటాయి అనగానే ఎస్ నిస్సందేహంగా దేవదాస్ బాటసారి ఇంకా ఏదో చెప్పబోతుండగా చాలు సార్  ఇక చెప్పకండి మీరు ప్రథమ తాంబూలం ఇచ్చిన దేవదాసు పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చారా ఆ వేషం తనకు తృప్తినిచ్చిందా  అనగానే నా తృప్తి అలా ఉంచండి ఆ దేవదాసుని సృష్టించినవాడు శరత్ గారైతే బ్రతికించినవాడు    సైగల్  తన పాటలను తానేపాడుకున్న గొప్ప గాయకుడు.దానికి ప్రాణ ప్రతిష్ట చేసినవాడు ప్రపంచం మొత్తం గర్వించదగినట్లు దిలీప్ కుమార్ గారు ప్రతి దృశ్యాన్ని పండించారు ఆయనే నా చిత్రం విడుదలైన తర్వాత చూసి ఎంతో సంతోషించి  ప్రత్యేకంగా నన్ను అభినందించడం కోసమే మద్రాస్ వచ్చారు  ఈ వేషం నాకన్న నీవు చేసింది బాగుంది చాలా గొప్పగా చేసారని తెలియజేశారు  బాబాయి గారు దర్శకుడు  వేదాంతం రాఘవయ్య గారు సినీ ప్రముఖులు ఎంతో మంది  నన్ను ప్రశంసించారు  ఇతరుల పొగడ్తలను నేను అడగడం లేదు సార్ ప్రస్తుతం ఆ సినిమాలను చూస్తే  ఈ రోజున ఎలాంటి అనుభూతి కలుగుతుంది మీకు  ఉదాహరణకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుని వివాహమాడి నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఓలలాడాలనుకున్న పార్వతి ని చూడడానికి ఎంతో ఆత్రుతతో వెళ్లిన దేవదాసుతో నెత్తిన పిడుగు పడినట్టే ప్రాణప్రదమైన పారు పరాయి వాడి పడతి గా వెళ్లిన క్షణం.ఆ సంఘటన తలచుకుంటేనే మెదడు మొద్దుబారి పోతుంది దానిని ఎనిమిది సెకన్స్ లో పూర్తిచేశారు భావ ప్రకటనకు ఎనిమిది పది సెకండ్లు సరిపోతుందా దాదాపు 40-45 సెకండ్లు పడుతుంది పార్వతి వార్త చెప్పగానే నిర్ఘాంత పోతాo స్పృహలోకి వచ్చి పరిసరాలను గమనించి తనను తాను సంబాలించుకుని మాటల కోసం నాభి నుంచి గొంతు దాకా శబ్దం కోసం ప్రయత్నించి గొంతు మూగబోగ ఆర్ద్రత నిండిన కన్నులు కన్నీరు సతమతమై చేతిలో వున్న  కర్రతో అరచేతిని కొట్టి గీతాన్ని నెమరు వేసుకుంటూ ఒక్కసారి మెట్ల వైపు చూసి  ఆంగికంగానే వాచకం గాని పనిచేయదు గనుక తలాడించి బయటకు వెళ్లిపోవాలి దీనికి పది సెకండ్లు సరిపోతుందా వేదాంతం గారు మీతో అంతవరకు చాలనుకుని ఉంటారు ఆ దృశ్యం ఇప్పుడు మీరు చూస్తే ఏమనిపిస్తుంది మీకు చెప్పండి  అని అడిగాను
==============================
సమన్వయం ; డా . నీలం స్వాతి 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం