ఆలోచన ధోరణి కూడా అంతే ప్రఖ్యాత రచయిత్రి లత గారిని డిటెక్టివ్ నవల వ్రాయమని అడిగితే రాయడం పెద్ద సమస్య కాదురా దొంగ దొర హతులు హంతకులు దూషించేవాడు దూషింపబడే వారు వీళ్ళలో హత్య చేసిన వాడి మీద నాకు మక్కువ ఎక్కువ ఎంత కఠినంగా క్రూరo గా మానసికంగా బాధను అనుభవించకపోతే చిత్రహింసలు పడకపోతే వాడు ఈ హత్య చేస్తాడు ఈ బాధ పడతాడు అనే ఆలోచనతో అతని మీద నాయకత్వం లక్షణాలను ఆపాదించి చూపాలని అనిపిస్తుంది నాకు మరి మన సమాజం అంగీకరిస్తుందా అనుమతిస్తుందా ఊహగానం పేరుతో వ్యాసాలను వ్రాసి చలo గారి స్థాయిని అందుకుంది లతా అని పిల్లల ప్రశంసలు అందుకోలేదా అని వాదించే వారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు వాళ్ళను తప్పు పడదామా వాళ్ళ అర్థాలు వాళ్లకే ఉంటాయి.తెలుగు తమిళ కన్నడ మలయాళం భాషలు మాట్లాడే దక్షిణాది వారే కాకుండా ఉత్తరాది నుంచి వచ్చిన అనేకమంది మన రాష్ట్రంలో ప్రత్యేకించి విజయవాడ నడిబొడ్డులో ఉన్నారు. వారు నడిపే వ్యాపార సంస్థలకు అనేక రకాల పేర్లు వాళ్ళ మాటల్లో రకరకాల యాసలు ప్రాంతీయం అన్య దేశీయ పదాలతో సంకరమైన పదాలను గమనిస్తే మనకు నవ్వు పుట్టుకొస్తుంది మనం సహజంగా తెడ్డు ను చూస్తూ ఉంటాం దాన్ని పప్పు తిప్పడానికి వాడుతూ ఉంటాం అది పరికరంగా ఉపయోగపడుతుంది తప్ప దాని రుచిని మనకు చూపదు ఆ శబ్దం మీద వచ్చిన ఒక నానుడి నానుడి అనగానే నేను ఎక్కువగా మాట్లాడే మాట నాకు గుర్తొస్తోంది బ్రతకలేకనే బడిపంతులు అన్నది నానుడి బ్రతికించడం కోసమే బడిపంతులు అన్నది నా"నుడి" అంటే మాట నానుడి అంటే జాతీయం అయితే నానుడి వేరు జాతీయo వేరు మనo లోతుకు వెళ్లనవసరం లేదు.
విషయానికొస్తే తెగిస్తే తెడ్డుఏ లింగం అన్న ఉపమానం అనేకసార్లు వింటూ ఉంటాం కొంచెం పదాలను విడదీసుకుని ఆలోచించినట్లయితే తెగ (శాఖాభేదం లేదా లింగ భేదం) ఇడిస్తే (వదిలివేస్తే) తెడ్డు తన బాధ్యతను తన పనిని తాను చేస్తూ ఇలా చేతిలో వస్తువుగా ఉన్నంతవరకు దాని స్థానం దానికి ఉంటుంది అది నిజానికి దైవ స్వరూపం భగవంతుడు దానికి ఏ పని అప్పగించాడో దానిని నిర్వహిస్తోంది కనుక అది లింగ స్వరూపంగా స్థిరంగా ఉంటుంది శివుడు పద్మాసనo లో కూర్చుని జగత్తు మొత్తాన్ని తన లయకారంతో నియంత్రిస్తూ కాచి రక్షిస్తూ ఉంటాడు కదా ఆ స్థితికి వెళ్లడమే దీని పరమావథి గీతాకారుడు ప్రవచించినట్లు నీ పని నువ్వు చేసుకో నిన్ను ఆజ్ఞాపించేది స్త్రీనా(దేవత పురుషుడా దేవుడా) లేకపోతే నపుంసకుడా(ప్రకృతి స్వరూపమా) అన్న మీమాంసని వదిలి నిన్ను నీవు తెలుసుకున్నట్లైతే నీలో ఉన్న భగవత్ స్వరూపాన్ని నువ్వే ప్రతిష్టించుకున్న అనుభూతి నీకు కలుగుతుంది ద్వైత స్థితి నుంచి అద్వైత స్థితికి పెరుగుతావు అన్నదే ఈ నానుడి అర్థం అని నా భావన.
========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి