ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
సనాతన ధర్మాన్ని అనుసరించే కుటుంబాలలో  ప్రతి వ్యక్తిలోనూ నేర్చుకోవలసిన  అంశాలు కొన్ని ఉంటాయి  విభిన్న మనస్తత్వాలతో కూడిన కుటుంబ సభ్యులందరినీ ఒక తాటిపై నడిపించి  క్రమశిక్షణతో  వారందరికీ మంచి జీవితాన్ని ప్రసాదించిన తండ్రిని చూసి  మనం నేర్చుకోవలసినది ఎంతో ఉంది  అసలు కుటుంబానికి మూడోస్తంభం తల్లి కదా నవ మాసాలు బిడ్డను గర్భంలో దాల్చి  తాను నిత్యం ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉన్నా బిడ్డను చూసి ఎంత తన్మయత్వం చెబుతుందో ఆ కన్నతల్లి  అది మాటలకు అందని  అనుభూతి  ప్రతి బిడ్డ అకారం మొదలు  క్షకారం వరకు జీవితంలో ప్రతి విషయాన్ని  తెలుసుకున్నది  తల్లి వల్లనే కదా మంచి నేర్చుకోవలసినది ఒకే ఒక వాక్యం కష్టపడకుండా ఏదీ రాదు అని.కుటుంబంలో చెల్లెళ్లు తమ్ముళ్లు ఉంటారు  వారు ఎలాంటి చిలిపి పనులు చేస్తూ ఉంటారు అందరికీ తెలిసిన విషయమే  దానిని అల్లరిగా గ్రహించినట్లయితే  ఆ అల్లరి ఎంత అందంగా ఉంటుందో అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది  ఓర్వలేనితనంలో ఒకరినొకరు  మాట్లాడుకునే మాటలు వింటూ ఉంటే  పెద్దలకు ఎంత వినోదంగా ఉంటుందో తెలుస్తుంది  ఇంకా ఇంకా మాట్లాడుకోవాలని పోట్లాడుకోవాలని అనుకుంటుంటారు  అన్నలు అక్కలు ఉన్న తమ్ముడు  పరిస్థితి వేరు  తమ్ముడు  ఏ కొంచెం కష్టపడ్డా వారు ఎంతో బాధపడుతూ ఉంటారు  వాడిని  తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా  గారాబంగా   చూసుకుంటారు  అక్క అన్నలు ఉన్నవారికి  కష్టం పలకరించదు  జీవితాన్ని చదవాలి అంటే చదివే ముందు కుటుంబాన్ని చదవాలి  అప్పుడు ఆ జీవిత పరమార్థం ఏమిటో తెలుస్తుంది.చంబై వైద్యనాథ భగవతార గారు అంటే  పోత పోసిన సంగీతం  కర్ణాటక సంగీతంలో  శాస్త్రీయంగా పలకగలిగిన  గొప్ప సంగీత కళాకారులలో ఒకరు సనాతన ధర్మాన్ని ఆచరించడంలో  వారిని మించిన వారు లేరు సంగీత సమ్రాట్  శ్రోత్రియుడు మూడు పూటలా సంధ్యావందనం చేసే బ్రాహ్మణుడు  భారత దేశంలో కుల వివక్ష అనేది సామాజికము వ్యక్తిగతంగా కాదు అనేదానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి  ఇది ఒక  షెడ్యూల్ లో పుట్టి క్రైస్తవునిగా మారిన  వ్యక్తి సంగీతం పట్ల చంబై ఆసక్తి గల ఒక యువకుడు  వారి వద్దకు వచ్చి ఆచరించి నాకు సంగీత బిక్ష పెట్టమని అడిగినప్పుడు  అతనిలోని ఆసక్తిని గమనించి చేరదీసి తన ఇంట్లో ఆశ్రయమిచ్చి గొప్ప సంగీత విద్వాంసునిగా తీర్చిదిద్దిన వారు  అయ్యగారు  ఏదైనా విద్య నేర్చుకోవడానికి కులం మతం అడ్డురాకూడదు అనేది వారు విద్య నేర్పింది కేజే యేసుదాసు కు, వైద్యనాథ భగవతార గారి సిద్ధాంతం  వారు విజయవాడ కేంద్రానికి వచ్చి  సంగీత కార్యక్రమాలను ఇవ్వడంతో పాటు  ఆంధ్రదేశంలో ఆకాశవాణి ద్వారా అనేక వేదికలపై తమ  సంగీత పరిజ్ఞానాన్ని పంచిన  అపర త్యాగరాజ మూర్తి అలాంటి వారి కార్యక్రమానికి నేను  నిర్వాహకునిగా ఉండి వారి గురించి ప్రేక్షకులకు చెప్పడం  నా అదృష్టం.
==================================
సమన్వయం ; డా. నీలం స్వాతి  


 
కామెంట్‌లు