ఆకాశవాణి విజయవాడ కేంద్రం;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆకాశవాణిలో బందా గారిది చాలా చక్కటి ఉదాత్తమైన ఉన్నత స్థానం నాటక నిర్వాహకులు ఆయన రేడియో కొచ్చిన కొత్తలో పూర్తి పేరు చెప్పించుకోవాలని  తహతహలాడుతూ ఉండేవారు ప్రతి నాటకానికీ నిర్వహణ ఆకాశవాణి విజయవాడ కేంద్ర నాటక ప్రయోక్త బందా కనక లింగేశ్వర రావు అని చెప్పించుకునేవారు అంత పెద్ద పేరు చెప్పడం కొంచెం కష్టంగా ఉందని ఆయనకు సన్నిహితంగా ఉండే ఆమంచర్ల గోపాల్ రావు బుచ్చిబాబు లాంటి పెద్దలు చెప్పినారు ఒక పర్యాయం మా సహ ఉద్యోగి గుర్రం కోటేశ్వరావు గారికి ఆయన పేరు చెప్పే అవకాశం వచ్చింది అనుకునే కావాలని చేశారో పొరపాటుగా చేశారో లేక నోరు తడ బడిందో ఆయన చెప్పింది నాటకం విన్నారు నిర్వహణ ఆకాశవాణి విజయవాడ కేంద్ర నాటక ప్రయోక్త ఖoదా బంక లింగేశ్వర రావు అని చెప్పి అప్పటికప్పుడే సరిజేసుకుని క్షమించాలి బందా కనక లింగేశ్వర రావు అని చెప్పారు.
తెల్లవారి నాటకం ఎంతో చండాలంగా ఉంది అని చెప్పాడు మన కోటేశ్వరరావు అంత బంక ఏంట్రా జీడిపప్పు లాగా చెండాలంగా కంద దురద రా  చాలా బాగా చెప్పాడు మన కోటేశ్వరరావు అని ఆమంచెర్ల వారు ఆట పట్టించారు అంతే ఆ క్షణంలోనే వెంటనే బందా కోటేశ్వరావు గారిని పిలిచినాయన నువ్వు ఎప్పుడు నా పేరు చెప్పవలసినా బందా అని చెప్పు అనడంతో ఆయన పేరు బందా గా ప్రాచుర్యం చెందింది ఆయన ఎప్పుడు అంటూ ఉండేవాడు కుక్క బ్రతుకు కుక్క కాపలా అని ఆయన ఎందుకని వారు మంచిగానో దోష పూరితంగానో అర్థం అయ్యేది కాదు నాకు 11 సంవత్సరాల క్రితం  మా అబ్బాయి ముద్దు లోలికే తెల్లని కుక్క పిల్లని తెచ్చి పేరు జిప్సీ అని పెట్టాడు చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది ముద్దులొలికే పసి కూన వంటి చంటి పిల్లల వేషాలన్నీ వేసేది పిల్లలతో ఆడుకునేది ఇవన్నీ చూస్తుంటే నాకు కొంచెం చికాకనిపించింది.
అప్పుడప్పుడు పిల్లలను మందరిస్తూ ఉండేవాడిని అరే దాన్ని కొంచెం దూరంగా ఉంచండి దాని శ్వాస వైరస్ ని పెంచి కొన్ని వ్యాధులు రావడానికి కారణభూతం అవుతుంది అని సూక్తి ముక్తావలి ఇచ్చేవాడిని పిల్లలు లెక్క చేసేవారు కాదు అలా అలా దాని ప్రతి చేష్ట రోజు రోజుకి నా దగ్గరికి తీసుకునేలా చేసింది ఎంతవరకు వెళ్లిందంటే జిప్సీకి పెట్టకుండా దాని పలకరించకుండా తినడం తిరగడం చేసే వాడిని కాదు ఇంట్లో మా కన్నా ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది మా అందరికన్నా పిల్లలకి అరుణకు మరీ సన్నిహితమైంది  14 సంవత్సరాలు నిరంతరం గా దాని అధికారం జలాయించింది ఉన్నట్టుండి ఓ రోజు భోజనం మానేసింది హఠాత్తుగా మరణించింది అంతా బాధపడ్డారు అందరినీ అంతగా ఆకట్టుకుంది ఆ ప్రాణి గురించి అందరిని  ఊరడించి కుక్క జీవితం ఏడు సంవత్సరాలు రా దాటితే మరో ఏడు సంవత్సరాలు మొత్తం 14 ఏళ్ళు అంతకుమించి  జీవించదు అని వేదాంతం చెప్పినా అది జ్ఞాపకం వచ్చి నా కళ్ళు చెమ్మగిల్లుతాయి.
===============================
సమన్వయం ; డా . నీలం స్వాతి 

కామెంట్‌లు