ఆ సమాచారం అందిన తర్వాత ఐదు గంటల 30 నిమిషాలు అయింది రాలేదు ఐదు నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేసి ఐదు నిమిషాల్లో మీ దగ్గర ఉంటారు అని సమాచారం అందించారు కలెక్టర్ గారు ఆవిడ కారులో వచ్చి కాసు బ్రహ్మానందరెడ్డి పీవీ నరసింహారావు సంజీవయ్యలు కారులో దిగక ముందే పరుగులాంటి నడకతో తేజస్విని లాగా ముందుకు తీసుకువచ్చి మొట్టమొదటి చెప్పిన మాట సారీ ఇది నా తప్పు కాదు తప్పు దారిలో రోడ్డు బాగు చేస్తున్నందువల్ల ఇది జరిగింది అని వివరణ ఇచ్చి రేడియో కళాకారులు ఎక్కడ అని శ్రీవాత్సవ గారిని అడిగితే ఆయన మమ్మల్ని చూపించారు అప్పుడు శ్రీవాత్సవ గారూ ఆకాశవాణి జరుగుతున్నది అంటే ఆ కళాకారుల దయవల్ల వాళ్లను నిలబెట్టడం ఏమిటి ముందుకు రమ్మనండి అందరిని పేరును అడిగి మాకు షేక్ హ్యాండిచ్చిన తర్వాత కుర్చీలో కూర్చొని మీ సాధక బాధకాలు ఏమిటి.మీకు జీతాలు సరిపోతాయా లేదా అని ప్రశ్నల మీద ప్రశ్నల వర్షo కురిపించింది చెప్పలేకపోయాం హిందీ తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఠాగూర్ కవితలను రథచక్రాలు పేరుతో రాచకొండ అనువదించారని వారి గురించి చెప్పారు మీరు మా రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా ఉన్నారు వారిని పితాజీ అని పిలిచేదాన్ని అని జ్ఞాపకం చేసుకున్నారు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది అనగానే దానికి రాచకొండ గారు గంభీరంగా కవితాత్మకంగా అమ్మ బిడ్డ ఆకలి ఆ బిడ్డ కన్నా తల్లికే తెలుస్తుంది మీరు మమ్మల్ని బిడ్డలా చూస్తున్న తల్లివి నీవు మమ్మల్ని రక్షించుకోవలసిన బాధ్యత మీదే అని వినమ్రంగా నమస్కరించి చెప్తే మా అందరి కన్నా ముందు ఇందిరమ్మ కన్నీళ్ల పర్యంత మైoది సంభాషణ అంతా హిందీలో జరిగింది తర్వాత రేడియో కళాకారుల సంక్షేమం గురించి ప్రశ్నించడం కళాకారులకు మీరు ఊహించిన దాని కన్నా ఎక్కువగానే ప్రకటించారు.ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కేకే షా గారు విజయవాడ వచ్చి విజయవాడ ప్రాంగణంలో బృందావన గార్డెన్లో మాట్లాడుతున్నప్పుడు విజయవాడ కేంద్ర నాటక ప్రయోక్త బందా కనకనంగేశ్వర రావు గారు అందరికీ జీతాలు పెంచండి అంటే మీకు ఎంత జీతం పెంచాలి అని అడిగారు మేమంతా నివ్వెరపోయాం. మేవంతా తేరుకోక ముందే కేకే షా గారు టాపిక్ ఫర్ టుడే చేయాలంటే ఫ్రాంక్ మోరీస్ ను పిలవాలి మంచి పాట కావాలనుకుంటే లతా మంగేష్కర్ మహమ్మద్ రఫీ వాళ్లని పిలిచి వారికి ఎక్కువ మోతాదులో డబ్బు ఇవ్వాలి అన్నారు తర్వాత రోజు పార్లమెంట్లో ప్రవేశించిన తర్వాత ఆయనను శాఖ నుంచి తప్పించి మద్రాస్ గవర్నర్గా పంపారు దీన్నిబట్టి సమాచార శాఖ ఎంత వేగంగా చురుగ్గా పనిచేస్తుందో తెలుస్తుంది.
========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి