ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ముందు కథను ఎలా ఎన్నుకోవాలి ఆ కథకు సంబంధించిన నటీనటుల ఎన్నికఎలా ఉండాలి  వారిని ఒక తాటి మీద నడిపించడానికి దర్శకుడు ఎవరు  ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇదేదో చాలా తేలికగా ఉన్నది అని అనుకుని  తాను  అనుకున్న కథను ఎవరితో ఒకరితో వ్రాయించి దానికి సంబంధించిన అన్ని వివరాలను  వ్రాసుకుని ఒక్కొక్కరితో మాట్లాడుతూ  ఉన్నప్పుడు  తాను ఎన్నిక చేసిన నటీనటుల ప్రవర్తన  వారు అడిగే డబ్బు గురించి  తెలుసుకొని  అప్పటికే తాను పొలం అమ్మిన డబ్బులన్నీ  ఖర్చు చేయడం  ఇక ఈ రంగంలో మనం పనికి రాము  అని నిర్ణయించుకొని అక్కినేని నాగేశ్వరావు గారి వద్ద డబ్బులు తీసుకొని రైలులో విజయవాడ చేరుకున్నారు  ఏం చేయడానికి పాలు పోలేదు  తనకు వంటలో మంచి ప్రావీణ్యం ఉంది  బజారులో కూర్చుని ఇడ్లీలు తయారుచేసి అమ్మడం  ప్రారంభించాడు.నాలుగు డబ్బులు పోగుచేసుకొని ఒక బండి కొని దానిపైన  ఇడ్లీ తో పాటు పెసరట్టు ఉప్మా చేయడం మొదలుపెట్టాడు  ఈయన పదార్థాలు రుచిగా ఉండడంతో చాలామంది ఈయనకు  అభిమానులు తయారయ్యారు నిత్యం వచ్చి  వీరి చేతి వంట రుచి చూసేవారు మరికొంత ధనం సేకరించిన తర్వాత ఒక చిన్న రేకుల షెడ్డు తీసుకొని దానిలో  తన కార్యక్రమం ప్రారంభించారు  ఆయనకు వివాహం అయింది పిల్లలు లేరు దానితో రెండవ వివాహం చేసుకున్నారు ఇద్దరు భార్యలు  అయినా బిడ్డలు లేరు  తన వ్యాపారం మాత్రం చాలా బాగా సాగుతోంది  గేదలను కొని మేపడం వాటి పాలతో కాఫీ తయారు చేయడం  ఆ పాలు అయిపోయిన తర్వాత ఎవరు వచ్చినా కాఫీ లేదని చెప్పడం  తాను ఇద్దరు భార్యలు ఇడ్లీ  ఉప్మా పెసరట్టు  కారప్పొడి కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడి  వెన్న నెయ్యి తయారుగా ఉంచుకునేవారు.
ఉదయమే వచ్చిన వారికి  ఎంతో ఆప్యాయంగా నాలుగు ఇడ్లీలు పెట్టి  ఆ ఇడ్లీలు నాలుగు తడిచేలా నెయ్యిని పోసి  దానిపై వెన్న పెట్టి  కారంపొడి అల్లం  పచ్చడి  కొబ్బరి పచ్చడి తో సహా వడ్డించేవారు అది తినేసరికి పెసరట్టు ఉప్మా  తీసుకొచ్చి వేసేవాడు తర్వాత చక్కటి చిక్కటి కాఫీ  ఎంతో రుచిగా తయారు చేసేవారు అందరిని ఆప్యాయంగా బాబాయి అని పిలుస్తారు  వయసుతో సంబంధం లేదు  ఆయన పేరు ఆయన మర్చిపోయారు ప్రతి ఒక్కరూ కూడా బాబాయి గారు బాబాయి గారు అనే పేరుతో మొదలు పెట్టారు  ఆ ప్రాంతంలో వ్యాపారస్తులు ఎక్కువ  వారందరూ ఉదయమే వచ్చేవారు  ఎవరికి ఏ పదార్థాలు ఇష్టమో ఆ పదార్థాన్ని ఎంతో ఆరోగ్యంగా వడ్డించేవారు  కొంతమంది వ్యాపారస్తులు మీగడ అడుగుతూ ఉంటారు అదీ వడ్డిస్తారు.
============================
సమన్వయం ; డా. నీలం స్వాతి 



కామెంట్‌లు