ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 బాబాయ్ ఎప్పుడూ గల్లా పెట్టి దగ్గర కూర్చుని ఎరగడు  తిన్న తర్వాత వెళ్లిపోయేవారు ఐదు రూపాయలు తీసి అక్కడ పెట్టి వెళ్లేవారు  ఎవరైనా చిల్లర లేక పది రూపాయలు ఇస్తే దానికి చిలర ఇచ్చేవాడు కాదు  అక్కినేని నాగేశ్వరావు గారు విజయవాడ వచ్చినప్పుడు తన బృందంతో వచ్చి అక్కడే  ఫలహారం చేసి ఆయన కబుర్లు విని వెళ్లేవారు  సామాన్యంగా ఆయన జీవితంలో  ఇడ్లీ తినరు  ఆవిరి కుడుo మాత్రమే తింటారు ఇక్కడికి రాగానే కాఫీ తాగడం రెండు ఇడ్లీ తినడం వెళ్ళే ముందు కాఫీ తాగడం వారి చర్య  వెళ్లేటప్పుడు జేబులో  200 ఉంటే  అది ఇచ్చి వెళ్లేవారు  పెండ్యాల నాగేశ్వరరావు గారి ద్వారా నేను బాబాయి గారికి పరిచయం అయ్యాను నా ప్రక్కన ఎప్పుడూ పెండ్యాల మరిది లక్ష్మయ్య ఉండేవారు  మేము మొదటిసారి వెళ్ళినప్పుడు నాకు తెలియక జేబులో నుంచి పది రూపాయలు నోటీస్తే ఆహా రేడియో వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయా  మీరు డబ్బులు ఇస్తే విజయవాడలో బోలెడు హోటల్స్ ఉన్నాయి నా దగ్గరికి రావడం ఎందుకు అనే వాడు ఎంతో ఆత్మీయంగా
కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో తిలోత్తమ  హోటల్ ని ప్రారంభించారు  తెల్లవారుజామున ముహూర్తం వల్ల  బ్రహ్మానంద రెడ్డి గారు  మద్రాస్ నుంచి విజయా స్టూడియోస్ నాగిరెడ్డి గారు ఇద్దరు వచ్చి ఆ రాత్రి విశ్రమించి  తెల్లవారి కార్యక్రమానికి హాజరయ్యారు  ఆ రాత్రి వారు నిద్రించడానికి ముందు  నిర్వాహకులు వచ్చి  మీరు ఉదయం  ఫలహారంగా ఏం తింటారు అని అడిగితే  అదేంటయ్య హోటల్ పెడుతున్నారు అనేక రకాలు చేస్తారు మీరు ఏది పెట్టినా మేము తింటాం అని బ్రహ్మానంద రెడ్డి గారు నవ్వుతూ సమాధానం చెప్పారు కానీ నాగిరెడ్డి గారు మాత్రం  నేను రెడ్డి గారు వచ్చారని బాబాయి గారితో చెప్పండి ఆయనే చూసుకుంటాడు అని నిద్రకు ఉపక్రమించారు.ఉదయం వారు లేచి కాలకృత్యాలు తీర్చుకునేసరికి బాబాయి గారు ప్రత్యక్షం  ఆ పదార్థాలు తిన్న తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారు విజయ నాగిరెడ్డి గారిని అడిగినందుకు చాలా మంచి వ్యక్తిని పరిచయం చేశారు  అని అభినందనలు తెలియజేశారు  అక్కినేని నాగేశ్వరావు గారు కాకుండా ఎన్టీ రామారావు గారు సాహితి లాంటి సినీ ప్రముఖులు మాజీ రాష్ట్రపతి  నీలం సంజీవరెడ్డి గారు  వంటి ప్రముఖులు అంతా బాబాయి హోటల్ నుంచి తినేవారు పూర్వం ఇది ఒక   పాక హోటల్  తరువాత రేకుల షెడ్  ఇప్పుడు పూర్తిగా మారింది ఇప్పుడు వారు చాలా రకాలు చేస్తూ ఉంటారు  పూర్వం  ఇక్కడ ఇడ్లీ అంటే నేతిలో స్నానం చేసినట్టుగా ఉండేది నేడు ప్రత్యేకతను కోల్పోయి సాధారణ స్థాయికి చేరుకుంది  అయినా బాబాయ్ హోటల్ అనే పేరు మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది.
=====================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు