పల్లెతన సహజత్వాన్ని కోల్పోయింది ;;-అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం964074849
ఊరంటే ఊట చెలిమె
 ఎన్ని జ్ఞాపకాల కలబోతోకదా మా ఊరు
మాఊరు పక్కనే ఏరు
పాడిపంటలకు మావూరు పెట్టింది పేరు
ఊరంటేపెద్ద కుటుంబం
కులమతాలు వేర్వేరైనా వావివరుసలతోపిలుచుకుంటుఒకరికొకరు తోడునీడగా ఉంటూ కొండంత ధైర్యంగా ఉండేది మా ఊరు
ఊరుకు ఒకవైపు శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి కొలువై ఉన్నాడు
ఊరు నడిమిట్ల బొడ్రాయి దేవత కొలువై ఉంది
గడీలవెలసింది గడిమైసమ్మ
నల్లచెరువుకట్టకు వెలిసింది కట్టమైసమ్మ
ఈదమ్మ పోచమ్మ  ఊరిని కాపాడే గ్రామ దేవతలు
ఊరు కన్నతల్లిలాంటిది
నీకేం కావాలంటుంది
మాఊరిచివర బడి ఎందరో మహామహులు చదివి ఆబడిలనే నేను కూడా చదివినా
మాబడిలో చదివిన వారు 
నేడు విభిన్న రంగాల్లో వివిధ హోదాలో ఉన్నారు

మా ఊరు కళలకు కాణాచి
మా ఊరు బడిప్రార్థన వేదిక మీద ప్రతి ఏటా జనవరినెలలో క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు
 మా పసితనములోనే చూసేటోళ్ళం అందుకే మాకు కళల పట్ల ఆనాడే మక్కువ పెంచుకున్నాము
కళలో అభినివేశం జరిగింది
కానీ 
ఊరు ఇప్పుడు తన సహజత్వాన్ని కోల్పోయింది  
నేడు రంగుల మార్చే ఊసరవెల్లి రంకు రాజకీయాలు తొణకనినిండుకుండలాంటి 
నా( మా)ఊరు ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు
 కొందరు మోసకారులు
ఒకప్పుడు ఒకే కుటుంబమైన  
మా ఊరు నేడు మారుతున్న సంకర సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ 
ఒకవైన్ షాపులు అడుగడుగునా బెల్ట్ షాపులు
దాబా హోటల్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి 
 ఊరు ఇప్పుడు కన్నతల్లి నైజాన్ని కోల్పోయి సవతి తల్లిగా మారుతోంది

మా ఊరులో ఒకప్పుడు అత్త ,మామ, తాత, అన్న ,తమ్ముడు, అక్క ,చెల్లి ,బామ్మ , అమ్మమ్మ అనే వావివరసలుఉండేవి 
అవిప్పుడు మరిచి ఆంటీ అంకుల్ అనే విచిత్ర వరుసలను అలవాటు చేసుకుంటుంది.
నా చిన్నతనంలో నా ఊరు నీకేం కావాలంది
 మరి ఇప్పుడు 
నా ఊరునాకేమీ ఇస్తావు అని అంటుంది 
పిదపకారం పిదప బుద్దులు
ఒకప్పుటి ఊరు కాదు ఇది.
 ఇప్పుడు మనుషులమధ్య వ్యాపార సంబంధాలు పెరిగి మా ఊరు తన సహజత్వాన్ని కోల్పోయింది.
ఇప్పుడు మా ఊరు ఇటూ పల్లెగా ఉండలేకా అటూపట్నలా
మార లేకా!?
రెంటచెడ్డరేవడైనది!?


కామెంట్‌లు