పచ్చని ప్రకృతే ప్రగతికి సోపానం;- :అంకాల సోమయ్య-:దేవరుప్పులసెల్:9640748497
మానవ మనుగడకు ప్రకృతి 
మూలాధారం 
పచ్చని ప్రకృతి సకలమానవాళికి
పండ్లు ఫలాలు కాయగూరలు దుంపలు నొసగి కాపుగాచే
అన్నపూర్ణేశ్వరీయేకదా
మనిషి తన సుఖ జీవనం కోసం భూమికి ఊపిరితిత్తులైన
వృక్ష జాలాన్ని తెగనరికి
కాలుష్యకాసారంగా మారుస్తున్నాడు.

రత్నగర్భఈనేల మనిషి అత్యాశతో సహజవనరులైన
బొగ్గు, సున్నపురాయి, బంగారం,
తగరం ,యురేనియం నిక్షేపాలు
వెలికి తీసి జీవవైవిధ్యానికి ఆటవిక జాతులు మనుగడకు పెను విఘాతం కల్గిస్తున్నాడు

ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం మూలంగా రేడియేషన్ ప్రభావం పెరిగి 
 పశుపక్ష్యాదులు వన్యప్రాణుల 
అంతరించే దశలో ఉన్నాయి

సహజమైన పండ్లు ఫలాలు
అసహజమైన రీతిలో మగ్గేలాచేసి మానవాళికి అల్సర్ ,కడుపు ఉబ్బరంగా ఉండటం వంటి లక్షణాలు పొడజూపుతున్నాయి.

పచ్చని ప్రకృతి ఒడిలో సకలమానవాళి సుభిక్షంగా ఉండాలి.

పంచభూతాలు
గాలి ,నీరు , నింగి ,నేల ,నిప్పు ,ఉష్ణ  కాలుషితమవుతున్నాయి.

ఈ కాలుష్యాలకు కారణమైన
వ్యక్తులైన ,సంస్థలైన శిక్షార్హమైనవావే

ప్రకృతిని మనం కాపాడితే
అది మనల్ని కాపాడుతుంది

అందమైన ప్రకృతి మన ఆయుష్షును  పెంచుతుంది.

పచ్చని ప్రకృతి మన ప్రగతికి
సోపానం.
ప్రకృతే ప్రాణికోటికది ప్రాణవాయువు వంటిది.

సర్వేజనా సుఖినోభవంతు
సర్వేసుజనాసుఖినోభవంతు
ఈ కవిత నా సొంతము

కామెంట్‌లు