రాజకీయం
రంకుది, బొంకుది
కవ్వింపు నేర్చినది
స్వలాభం కోసం
కృత్రిమ సమరాలు సృష్టించేది
రాజకీయం
అంటే
ఓ సినిమా స్టార్ రైటర్ అన్నట్టు
రా -అంటే రాక్షసంగా
జ -అంటే జనానికి
కీ -అంటే కీడు చేయు
యం -అంటే యంత్రాంగం
ఇది (నేటి) రాజకీయం
చిరకాల శత్రువులేని
చిరకాల మిత్రులు లేని
ఓ విచిత్ర కలయిక
రాజకీయం వ్యసనమే
1980వరకు
రాజకీయం కొంత లో కొంతైన
జనరంజక పాలన నుండేది
1990నుండి వ్యక్తి స్వామ్యం పెరిగి స్వార్థం
వేళ్ళూనుకుంది
2000నుండి రాజకీయమంతా
రంగులు మార్చే ఊసరవెల్లి
అయ్యింది
ఆయాపార్టీల్లో
ఆయారామ్
గయారామ్ లు
ఎక్కువై
పార్టీల
జెండా
ఎజెండా
ఆచరణ సాధ్యం కానీ
హామీలు
అరిచేతిలో వైకుంఠం చూపే
టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు
రాజకీయం అంటే సకల మానవాళికి కీడు తలపెట్టనటువంటిది
రా- అంటే రామరాజ్యం
జ -అంటే జనానికి
కీ- కీడు తలపెట్టని
యం -యంత్రాంగం
రాజకీయనాయకులు
తమ ప్రవర్తనను మార్చుకున్నప్పుడు
రాజకీయ అంటే
అది ప్రజాసేవ
రాజకీయం అంటే
సర్వజన శ్రేయస్సు
రాజకీయ మంటే
కుట్ర, కుతంత్రం
రణతంత్రం
లేని
జనతంత్రం అదే ప్రజాస్వామ్యం
రాజకీయం అంటే
మనకు (అభ్యర్థికి) దక్కిన గొప్ప వరం
(అది సేవా భాగ్యం)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి