కాలక్షేపమే జీవితమా!?;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగామ9640748497

 కాలక్షేపమే
జీవితమా!?
గాలివాటుగా
జీవన యానమా!?
ప్రగతి శూన్యమై
నిరాశ వరమై 
తడారిపోయిన 
ఎడారి సమమై
తననూతానే
నిందించే తత్వమా!?
చేతులు కాల్చుకొని
ఆకులు వెతుకా ఫలమే లేని 
గుణమా!?
 ముందుకు
వెనక్కిచూసే
లోపే
వార్ధక్యం
మహా భాగ్యమా!?
ఆశలు రాలి
ఆకాంక్షలు కూలి
ఆ కాటికి చేరే సమయం
జొచ్చి
తీరని దుఃఖ బతుకున
పులిమి 
శోక గీతం ఆలపిస్తూ---!?

కామెంట్‌లు