అంథవిశ్వాసాలకు చరమగీతం పాడుదాం;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
  ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం
ఇంతగా అభివృద్ధి చెందిన ఈరోజుల్లో కూడా 
పిల్లి అడ్డొస్తే
ఏదో అపశకునంజరుగుతుంది
అని
కాకులు ఇంటిమీద వాలితే ఇంటికి చుట్టాలు వస్తారని

మనం ఊరికి ప్రయాణమై పోయేటప్పుడు ఎవరైనా తుమ్మితే ప్రయాణం మానుకోవడం

ఒంటిమీద బల్లిపడితే బల్లినివారణదోషంకోసమై
బల్లిపంచాంగాన్ని తిరగేయడం

ఏ అంథయుగానికో మన పయనం
విజ్ఞాన శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిన ఈరోజుల్లో చూసిందే నమ్ము నమ్మిందే చూడు
అనే విచక్షణ మరచి

 దేవుడిగుడిచుట్టు ప్రదక్షిణాలు
కడుపు పండాలని దేవుడికి
ముడుపులు కట్టడాలు

ఏ తిరోగమనానికి మూలకారణం 
గగనతలంలోకీ రాకెట్లు పంపే
సమయమందు కూడా దేవదేవుళ్ళను మ్రొక్కిలాంచ్ చేయడం
ఏ మూఢభక్తి కిది అద్దం పడుతుంది

ఇకనైనా మారుదాం
నారాయణ నారాయణ అంటే
నారాయణ నోట్లో పాయసంపోస్తాడా!?
నీరసం వస్తుంది తప్పా!?
పనిని మన విధిగా తలచి
స్వశక్తిపై నమ్మకంతో
మనల్ని నడిపించేవి
మన ఆశలు, ఆకాంక్షలు తప్పా
ఈ మూఢనమ్మకాలు నడిపించలేవు
మనోదౌర్భల్యంకలవారే అంథవిశ్వాసాలను విశ్వసిస్తారు

శాస్త్ర విజ్ఞానము అభివృద్ధిజరగాలి
మనలో ఉన్న అజ్ఞానం దూరం కావాలి
ఏదైనా తార్కిక ఆలోచనతోనే
మానవాభివృద్ధి జరుగుతుంది
మానవాభివృద్ధి జరిగినప్పుడే
గుడ్డినమ్మకాలకు చరమగీతం
పాడేది.


కామెంట్‌లు