ఆర్యోక్తులు;- -గద్వాల సోమన్న,9966414580
మనోధైర్యం కొండ
జీవితంలో అండ
గెలుపుకు త్రోవ నీకు
ఎన్నడూ కోల్పోకు

పట్టుదలే ఉంటే
విజయం నీవెంటే
పిరికితనము చూపకు
నైరాశ్యం కోరకు

నిరంతర సాధన
సాధ్యాలకు నిచ్చెన
తెచ్చిపెట్టును కీర్తి
పంచిపెట్టును స్ఫూర్తి

అనుమానం దయ్యం
వద్దు వద్దు కయ్యం
భగవంతుని సన్నిధి
జీవితాన పెన్నిధి

ఘోషించే అంబుధి 
భ్రమించే మన మది
ఇట్లుంటే నెమ్మది
ఇక గగన కుసుమమది


కామెంట్‌లు