ప్రబోధ మాలిక;- -గద్వాల సోమన్న,9966414580
పెందలకడనే లేవాలి
శుచిగా స్నానం చేయాలి
దైవ నామ స్మరణ చేసి
ప్రశాంతంగా బ్రతకాలి

త్వరగా సిద్ధం కావాలి
ఉతికిన దుస్తులు తొడగాలి
సోమరితనం వదిలేసి
రోజూ బడికి పోవాలి

గురువుకు దండం పెట్టాలి
వారి బాటలో నడవాలి
శ్రద్ధగా పాఠాలు విని
విజ్ఞానామార్జించాలి

చక్కగా చదువుకోవాలి
ఉన్నతంగా ఎదగాలి
ఉన్న ఊరికి,కన్నోళ్లకు
పేరు ప్రతిష్టలు తేవాలి

అల్లరి పనులు మానాలి
ఎల్లరి మన్నన పొందాలి
మల్లె పందిరి రీతిలో
అల్లుకుపోవాలి ఖ్యాతిలో

చదువులెన్నో చదవాలి
సంస్కారమే నేర్వాలి
అమ్మానాన్నల ఆశలను
దీక్షతోడ నెరవేర్చాలి


కామెంట్‌లు