సాటిలేని అమ్మ మేటి;- -గద్వాల సోమన్న,9966414580
అమ్మ ప్రేమ నీడలో
హాయి ఎంతో ఉన్నది
ఆమె మాట మేడలో
మిగుల  భద్రత ఉన్నది

తల్లి చేయు సేవలో
త్యాగమెంతో ఉన్నది
ఆమెకున్న మనసులో
ఆకాశమే చిన్నది

అమ్మ ఉన్న చోటులో
లోటు ఎక్కడున్నది?
ఆమె లేని ఇంటిలో
వెలుగు ఎక్కడున్నది?

అమ్మకున్న స్థానమే
మహోన్నతం సృష్టిలో
ఆమె చూపు మార్గమే
దేదీప్యం బ్రతుకులో

అమ్మను మించిన వేల్పు
అవనిలోన ఎక్కడ?
హృదయమే  పూలపాన్పు
కుటుంబాన మేలుకొల్పు


కామెంట్‌లు