టిట్ బిట్స్... సేకరణ.. అచ్యుతుని రాజ్యశ్రీ
బ్లడ్ లెస్ రివల్యూషన్ అంటే తెలుసా?1688లో 3వవిలియం  
2వమేరీకి సింహాసనం పై హక్కు కల్పించింది బ్రిటిష్ పార్లమెంట్.కానీ రాజుకి వీటోహక్కు ఇచ్చింది.దీన్ని రాయల్ వీటో అన్నారు.

బ్రిటిష్ తొలి ప్రధాని సర్.రాబర్ట్ వాల్ పోల్.19 వశతాబ్దం తొలి రోజుల్లో అన్యాయ అక్రమ మార్గాలల్లో డబ్బు లిచ్చి మద్యంపోసి ఓట్లు కొనటం ఆరంభం.ఎలక్షన్ లో అక్రమాలు కొట్లాటలు జరగకుండా మిలట్రీ అజమాయిషీ ఉండేది.అదే అవినీతిమార్గంని ఎంచక్కా మనం అనుసరిస్తున్న గొప్పోళ్ళం!?

1778 లో తొలి సారి జర్నలిస్టుల్ని పార్లమెంటు లోకి అనుమతించారు.ఆనాటినుంచి బ్రిటిష్ పేపర్లలో రాజకీయాలు పూర్తిగా రంజుగా రావడం పార్లమెంటు పై పేపర్లు పట్టుసాధించడం మొదలైంది.

మన భారతీయ రాయిటర్స్ విలేఖరి శివరాం పంపినవార్త 1947 లో ప్రపంచాన్ని ఓకుదుపు కుదిపింది.శ్రీశివరాం సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టగానే 14 మంది మంత్రులతో సహా ప్రధాని మృత్యువాత పడటం చూసి వెంటనే రాయిటర్స్ కి వార్త అందజేశారు.బర్మా మాత్రం బైటి ప్రపంచంతో సంబంధాలు తెంపుకుంది.శివరాం వార్త గరంమసాలా గా లోకమంతా గుప్పుమంది 🌹

కామెంట్‌లు