కాలభైరవ ఆష్టకమ్;- కొప్పరపు తాయారు
 🍀 శ్రీ ఆదిశంకరాచార్య విరచిత 🍀

 శ్లో!! శూలటంక పాశదండ పాణి మాది కారణం
      శ్యామకాయ మాదిదేవ మక్షరం నియామకం !
     భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
      కాళికా పురాధి నాది కాలభైరవం భజే !!

 భావం: శూలము_టంకము_పాశము_దండము
 అను ఆయుధములను చేతులలో ధరించినవాడు, అన్నిటికి ఆది కారణమైన వాడు,
నల్లని శరీరము కలవాడు,ఆదిదేవుడు,నాశము లేనివాడు,దోషము లంటని వాడు,భయంకరమైన
పరాక్రమము కలవాడు, సమర్ధుడు,విచిత్రమైన
తాండవం మును ఇష్టపడు వాడు,
కాశీ నగరమునకు అధిపతి యైన కాలభైరవుని 
సేవించుచు నన్నాను.
                  *****


కామెంట్‌లు