సృజనాత్మక రచనలతో సామాజిక చైతన్యం;- -డా.సూర్యప్రకాశ్ రావు

 సుప్రసిద్ధ కవి దాశరథి కృష్ణమాచార్యులు సృజనాత్మక రచనలతో సామాజిక చైతన్యాన్ని కలిగించారని ప్రముఖ కవి డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో దాశరథి శత జయంతి సంవత్సరం సందర్భంగా మంగళవారం  జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దాశరథి కవిత్వం రాయడంతో పాటు కథలు, నాటికలు కూడా రాశారని ఆయన చెప్పారు. గాలిబ్ గీతాలను తెలుగు  పాఠకులకు అందించిన గొప్ప అనువాదకుడిగా దాశరథిని ఆయన పేర్కొన్నారు. 'అగ్నిధార', 'రుద్రవీణ' మొదలైన గొప్ప గ్రంథాలను దాశరథి కృష్ణమాచార్యులు వెలువరించారని పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు వి. సత్యనారాయణాచారి అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందడంతో పాటు ఎన్నో సత్కారాలను ఆయన పొందారని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు యూసుఫ్ షరీఫ్, మహేందర్ రెడ్డి, సురేశ్, సుందరయ్య, వేంకటేశ్వర రావు, సత్యనారాయణాచారి, అప్పలనాయుడు, కవిత తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు