పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి, అవి చెట్లుగా పెరిగేవరకూ కృషి చేయాలని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు.
వాతావరణంలో కాలుష్య నివారణకు విరివిగా పచ్చదనం చేకూర్చాలని అందుకు మనమంతా బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. షేక్ రషీద్ అనే ఏడవతరగతి విద్యార్థి నేడు తన పుట్టినరోజు సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్క నాటాలని సంకల్పించుట పట్ల ఆయన మిక్కిలి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయులంతా వృక్షాలు పెంచడం మానవుని మనుగడకు, జీవనోపాధికి, పురోగతికి ముఖ్యమైన ఆరోగ్య సోపానాలని ప్రసంగించారు. ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి