ఉరువేల కశ్యపుడు తన శిష్యులతో సంఘంలో చేరిన సంగతి తెలిసి అతని సోదరులైన నదీ కశ్యకుడు గయా కశ్యకుడు ధర్మం పట్ల ఆసక్తితో తమ శిష్యులతో సంఘంలో చేరి దీక్షను తీసుకొని భిక్షువు లైనారు తరువాత ముగ్గురు జటిల కశ్యపులు వారి శిష్యులు అనుసరించగా బుద్ధుడు ఉరివేల నుంచి గయా శీర్షానికి వెళ్ళాడు ఎప్పుడు అగ్నినే పూజిస్తూ యజ్ఞ యాగాదులలో కాలం గడిపిన కశ్యపులు వారి వెయ్యి మంది శిష్యులకు బుద్ధుడు యజ్ఞవేదికలలో నుంచి ఎగసిపడే మంటలలో ఏమీ లేదు అని మనలోని కళ్లు రూపం స్పర్శ వేదన సంజ్ఞలు రాగ మోహావేశాలనే మంటలలో కాలిపోతున్నాయని ఆ మంటలను ఆర్పినప్పుడే నిజమైన సుఖం శాంతి చేకూరుతాయని ఆదిత్య పరియాయ సూత్రాన్ని బోధించాడు.భగవానుడు గయలోని గయా శీర్ష ఉన్నప్పుడు వేయమంది భిక్షువులతో భిక్షువులారా అంతా మండుతూనే ఉంది మరి ఈ మండేదంతా ఏమిటి కళ్ళు మండుతుంది రూపాలు మండుతున్నాయి కళ్ళలోని చైతన్యం విజ్ఞానం మండు తుంది కంటి స్పర్శతో పుడుతున్న వేదన కూడా రగులుతుంది సుఖమైన దుఃఖమైనా సుఖం లేకపోయినా దుఃఖం లేకపోయినా కంటి స్పర్శతో పుడుతున్న ప్రతిదీ కాలిపోతూనే ఉంది అది దేనితో కాలుతోంది రాగం అనే మంటలో పడిపోతుంది ద్వేషం అనే మంటలో కాలికి పోతుంది మొహం అనే మంటలో కాలిపోతుంది అంతేకాదు అది పుట్టుక ముసలితనం మరణాలతో కాలి పోతుంది దుఃఖాలతో మండిపోతుంది పరివేదనలతో మండిపోతుంది.
బాధలతో మండిపోతుంది నిరాశ నిస్పృహలతో మండిపోతుంది ఆ మంట ఎప్పుడూ మండుతూనే ఉంటుంది అలా మనలో అన్ని కాలిపోతూనే ఉన్నాయి. ఈ విధంగా అన్ని కాలిపోతున్నాయని అనుభవం తెచ్చుకున్న ఆర్య శ్రావకుడు కన్ను రూపం కంటి విజ్ఞానం కంటి స్పర్శ వల్ల పుట్టిన వేదనలు సుఖకరమైన దుఃఖకరమైన సుఖకరమో దుఃఖకరమో కాకపోయినా వాటి వల్ల విరప్తుడై జుగుప్స పొoదుతాడు అనాసక్తుడు అవుతాడు అలాగే అతడు చెవులు మండుతున్నాయని శబ్దాలు మండుతున్నాయని ముక్కు మండుతుందని వాసన మండుతుందని నాలుక మండుతుందని రుచి మండుతుందని శరీరం మండుతుందని స్పర్శ మండుతుందని చిత్తం మండుతుందని చిత్త ధర్మాలు మండుతున్నాయని విజ్ఞానం అందుతుందని చిత్త స్పర్శ చిత్త స్పర్శ మండుతుందని వీటి వల్ల పుట్టిన వేదనలు సుఖకరమైన దుఃఖకరమైన సుఖకరము దుఃఖకరము కాకపోయినా అవి మండుతూనే ఉన్నాయని అవన్నీ పుట్టుక ముసలితనం మరణం స్పృహలతో మండిపోతున్నాయి అన్న సంగతి తెలిసిన ఆర్య సేవకుడు కళ్లు కంటి విజ్ఞానం కంటిస్పర్శ నుంచి పుట్టిన వాటివల్ల సుఖకరమైన దుఃఖకరమైన సుఖకరమో దుఃఖకరమో కాకపోయినా వాటి పట్ల అనాసక్తుడు అవుతాడు విరక్తుడు అవుతాడు.
==================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి