కాలం పరుగెడుతుంది
వెంట నడువమంటుంది
వేగము పుంజుకోమంటుంది
వెనుక పడవద్దంటుంది
గడియారం తిరుగుతుంది
గంటలు గడుపుతుంది
రోజులు మారుస్తుంది
ఏళ్ళు దాటిస్తుంది
జీవనపయనం సాగిస్తుంది
కాలచక్రాలు కదిలిస్తుంది
గమ్యాలు చేరువచేస్తుంది
జీవితం ముందుకుజరుపుతుంది
సూర్యుడు ఉదయిస్తుంటాడు
నిద్దురలేపుతుంటాడు
వెలుగులుచిమ్ముతుంటాడు
రోజులుపైనబడేస్తుంటాడు
జీవితం గడుస్తుంది
అందాలుచూపుతుంది
ఆనందాలనిస్తుంది
అనుభవించమంటుంది
వయసు పెరుగుతుంది
తత్తరపెడుతుంది
తటపటాయిస్తుంది
తమాయించుతుంది
వృధ్యాప్యము ముంచకొస్తుంది
పరీక్షలు పెడుతుంది
తట్టుకొని నిలవమంటుంది
తత్వాన్ని ఎరుకపరుస్తుంది
కాలప్రవాహం సాగుతుంది
కాపురాలు కూలుస్తుంది
కొంపలు ముంచుతుంది
కుటుంబాలు నశింపజేస్తుంది
చివరకు తెలుస్తుంది కాలము ఆగదని
కర్మలు తప్పవని కాటికి ఏగాలని
శరీరం అశాశ్వతమని సంసారం అస్థిరమని
బాంధవ్యాలు క్షణభంగురాలని జీవితం కాలపరిమితమని
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి