దిగులైన చీకటి నిండి
ఒంటరైన కనులలో
సుడులుతిరిగిన నీటికి
మసకగా కనిపించే ఆశ...రేపు
దిక్కు తోచని పయనంలో
తక్కువైన సమయంలో
ఒక్కసారిగా కమ్ముకున్న
నిరాశకు...ఊతమిచ్చే ఊహే
రేపు
దారితప్పిన అడవిలో
తోడులేని ఒంటరికి
తరగని త్రోవలో..దూరాన
వినబడే పిలుపే......రేపు
అర్థం లేని బంధాల
అర్థమవని మమతల
అరుదైన వలలో చిక్కిన
మనసును ఓదార్చే మాట.. రేపు
కనిపించని యుధ్ధంలో
వినిపించని కేకలు పెడుతూ
కరుణించని న్యాయంకోసం
వెదికే మనసుకు కానుక......రేపు
మౌనమైన వేదనలన్నీ
మధనపడే మదికి
మిగిలిన ఒకటే ఆశ...రేపు
రేపన్న కమ్మని ఆశల
రూపంలా వచ్చే వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి