యసుడు వారిని బుద్ధుని వద్దకు తీసుకొని వెళ్లి వారి కోరికను బుద్ధునికి తెలియజేశారు అప్పుడు బుద్ధుడు వారికి కూడా ధర్మ ఉపదేశo చేయగా అది విన్న మిత్రులైన నలుగురు అర్హoతలైనారు కాశీ చుట్టూ ప్రక్కల వివిధ మండలాలకు చెందిన 50 మంది యసుడు అతని దగ్గర మిత్రులు దీక్ష పొందారని విన్నారు తాము కూడా యసుని మాదిరిగా ధర్మదీక్ష తీసుకోవడానికి సిద్ధమని తెలిపారు అప్పుడు యసుడు వాళ్ళందరిని బుద్ధుని వద్దకు తీసుకు వెళ్ళాడు అప్పుడు బుద్ధుడు యసుని 50 మంది స్నేహితులకు ధర్మాన్ని బోధించాడు తర్వాత వారంతా సంఘంలో చేరి అర్హంతులైనారు అలా బుద్ధుడు మొదటి ప్రవచనం చేసిన తర్వాత రెండు నెలల లోపు మొత్తం 60 మంది అర్హంతులైనారు భిక్షువుల సంఖ్య 60కు చేరింది.60 మందికి సత్యాన్ని ఎరుకపరిచిన తర్వాత బుద్ధుడు వారిని ఉద్దేశించి భిక్షువులారా నేను మానవ దైవ సంబంధాల నుంచి విముక్తుడైనాను మీరు కూడా అలాగే మానవ దైవ సంబంధాల నుంచి విముక్తులైనారు బహుజన సుఖం కోసం బహుజనుల హితం కోసం ప్రపంచం మీద అనుకoపతో మానవుల దేవతల సుఖం హితాల కోసం ముందుకు సాగండి మీలో మీ ఇద్దరూ కలిసి ఒకే మార్గంలో మాటలపరంగానూ సారంపరంగానూ మొదట చివర మధ్య అంతటా కళ్యాణవంతమైన ఈ ధర్మాన్ని బోధించండి పవిత్రమైన పరిపూర్ణమైన శుద్ధమైన జీవితాన్ని ప్రచరితం చేయండి కళ్ళలో దుమ్ము ఉన్నవారు సరైన సంధ్య దృష్టి లేని వారు ధర్మాన్ని వినగానే ఏమాత్రం ఆసక్తి లేకుండా పట్టించుకోకుండా దూరంగా వెళ్లిపోతారు మరికొందరు ధర్మాన్ని అర్థం చేసుకునే వారు కూడా ఉంటారు ధర్మాన్ని పోషించడానికి నేను కూడా సేనాని గ్రామమైన ఉరువేలకు వెళతాను ఇతరుల బాగు కోసం కృషి చేస్తూ మహోన్నతమైన సాటిలేని ధర్మాన్ని ప్రబోధించినప్పుడే మీ విధిని మీరు నిర్వర్తించిన వారు అవుతారు అని కర్తవ్య బోధ చేశాడు.అప్పటివరకు కొత్తగా సంఘంలో చేరే వారికి బుద్ధుడే దీక్షను ఇచ్చేవాడు కానీ సంఘం వృద్ధి చెందడానికి 60 మంది భిక్షువులు ధర్మబోధకై 60 ప్రాంతాలకు వెళ్లిపోవటం ఆయా ప్రాంతాలలో ఆసక్తి కలవారికి దీక్షనివ్వడానికి బుద్ధుడు భిక్షువులకు అనుమతిని ఇచ్చాడు ధర్మబోధ గావించడానికి రుషి పట్టణం నుంచి ఉరివేలకు వెళుతూ త్రోవలో ఉన్న ఒక తోటలోని ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు అప్పుడే ఆ తోటలోకి సరదాగా ఉల్లాసంగా గడపడానికి 30 మంది యువకులు తమ తమ భార్యలను వెంటబెట్టుకొని వచ్చారు వారిలో ఒకరికి మాత్రం అతనితో పాటు అతని భార్య రాలేదు అందువల్ల తనతో ఉల్లాసంగా గడపడానికి భార్యకు బదులుగా ఒక వేశ్య ను తీసుకొని వచ్చాడు.
============================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి